News May 24, 2024

ఇంటర్నేషనల్ కిడ్నీ రాకెట్‌లో HYD వైద్యుడు

image

కేరళలో బయటపడ్డ ఇంటర్నేషనల్ కిడ్నీ రాకెట్ సూత్రధారి HYD వైద్యుడని ఆ రాష్ట్ర పోలీసులు గుర్తించారు. అతడి పేరును వెల్లడించలేదు. ఇప్పటి వరకు బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన 40 మంది పేద యువకులను ఇరాన్ తీసుకెళ్లి కిడ్నీలు విక్రయించినట్లు తెలిపారు. ₹20 లక్షలు ఇస్తామని చెప్పి ₹6 లక్షలే ముట్టజెబుతున్నారన్నారు. ముఠా సభ్యుల్లో ఒకరైన సబిత్‌ను అరెస్టు చేసి ప్రశ్నించడంతో వివరాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు.

Similar News

News January 17, 2026

సంక్రాంతి 3 కాదు, 4 రోజుల పండుగ

image

సంక్రాంతి అంటే అందరూ మూడ్రోజుల పండుగ అనుకుంటారు. కానీ ఇది 4 రోజుల సంబరం. భోగి, సంక్రాంతి, కనుమలతో పాటు ముక్కనుమ కూడా ముఖ్యమైనదే. ఈ ముక్కనుమ నాడే కొత్త వధువులు, అమ్మాయిలు బొమ్మల నోము ప్రారంభిస్తారు. 9 రోజుల పాటు మట్టి బొమ్మలను కొలువు తీర్చి, తొమ్మిది రకాల నైవేద్యాలతో అమ్మవారిని పూజించడం ఈ రోజు ప్రత్యేకత. పశుపక్షాదులను, ప్రకృతిని గౌరవిస్తూ జరుపుకునే ఈ ముక్కనుమతోనే సంక్రాంతి సంబరాలు సంపూర్ణమవుతాయి.

News January 17, 2026

అధిక ఆదాయాన్నిచ్చే హైబ్రిడ్ కొబ్బరి రకాలు

image

☛ వైనతేయ గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. ఏటా చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ వశిష్ట గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ అభయ గంగ: నాటిన 4 ఏళ్లకు కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 135 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 72 శాతం. కొబ్బరి నూనెకు ఇది అనుకూలం.

News January 17, 2026

మరో రెండు అమృత్ భారత్ ట్రైన్లు

image

TG: తెలుగు ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. అమృత్ భారత్ కేటగిరీలో మరో 2 కొత్త రైళ్లను కేటాయించింది. చర్లపల్లి-నాగర్‌కోయల్, నాంపల్లి-తిరువనంతపురం మధ్య ఏపీ మీదుగా నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23న PM మోదీ వీటిని ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి తిరిగే అమృత్ భారత్ రైళ్ల సంఖ్య మూడుకు పెరిగింది.