News February 12, 2025

HYD: WOW.. 250 ఎకరాల్లో పచ్చని పార్క్..!

image

HYD చేరువలో RR జిల్లా నార్సింగి మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్కింగ్ పార్కులో ప్రతి శనివారం నేచర్ క్యాంపులు జోరుగా సాగుతున్నాయి. ఈ పార్కు 250 ఎకరాల్లో విశాలంగా విస్తరించి ఉంది. ఉ.5 గంటలకు నిద్రలేపే పక్షుల సందర్శన, ట్రెక్కింగ్ కోసం తీసుకెళ్తున్నారు. పచ్చని వాతావరణంలో అమితానందం పొంది, సకుటుంబంతో సంతోషంగా గడిపేందుకు ఇదొక చక్కటి ప్రాంతంగా పర్యటకులు చెబుతుంటారు. #SHARE IT

Similar News

News February 12, 2025

Stock Markets: లాభాలు నిలబెట్టుకోలేదు..

image

బెంచ్‌మార్క్ సూచీలు నేడు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ 23,045 (-26), సెన్సెక్స్ 76,171 (-122) వద్ద ముగిశాయి. ఒకానొక దశలో నిఫ్టీ 200, సెన్సెక్స్ 600 Pts మేర నష్టపోయి మళ్లీ పుంజుకోవడం గమనార్హం. PSU బ్యాంకు, ఫైనాన్స్, మెటల్ సూచీలు ఎగిశాయి. ఆటో, ఐటీ, ఫార్మా, రియాల్టి, హెల్త్‌కేర్, O&G సూచీలు ఎరుపెక్కాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్బీఐ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా స్టీల్ టాప్ గెయినర్స్.

News February 12, 2025

శుభ్‌మన్ గిల్ ‘శతక’బాదుడు!

image

భారత స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో సెంచరీతో కదం తొక్కారు. 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇది ఆయనకు 7వ వన్డే సెంచరీ. ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో గిల్ 87, 60 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే. కాగా.. భారత్ స్కోరు ప్రస్తుతం 206/2గా ఉంది. మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్ 43(36 బంతుల్లో) కూడా ధాటిగా ఆడుతున్నారు.

News February 12, 2025

శామీర్‌పేట్‌లో యాక్సిడెంట్.. యువతి మృతి (UPDATE)

image

శామీర్‌పేట్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యి చికిత్స పొందుతున్న యువతి భవాని మంగళవారం అర్ధరాత్రి మృతి చెందింది. సోమవారం రెడీ‌మిక్స్ వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలు కాగా వెంటనే కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు వైద్యచికిత్సల నిమిత్తం రూ.రెండున్నర లక్షలు వసూలు చేశారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

error: Content is protected !!