News March 17, 2024

HYD: యువకుడి ఆత్మహత్య

image

ఉరేసుకుని హాస్టల్ నిర్వాహకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చిబౌలి PS పరిధిలో జరిగింది.SI శోభన్ వివరాల ప్రకారం.. అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ (29) గచ్చిబౌలిలోని ఓ భవనాన్ని అద్దెకు తీసుకొని 11 నెలలుగా శ్రీ దుర్గమెన్స్ పీజీ హాస్టల్ నిర్వహిస్తూ అక్కడే ఉంటున్నాడు. కాగా శనివారం అతడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News December 10, 2024

లష్కర్ జిల్లా సాధన కృషి: మాజీ పీసీసీ అధ్యక్షుడు

image

లష్కర్ జిల్లా సాధనకు త్వరలోనే ముఖ్యమంత్రితో సమావేశం అయినప్పుడు జిల్లా సాధన గురించి చర్చిస్తానని మాజీ పీసీసీ అధ్యక్షుడు మాజీ MLA వీహెచ్ హనుమంతరావు అన్నారు. మంగళవారం లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుగు గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆయనను అంబర్‌పేటలో కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు. ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్ పాల్గొన్నారు.

News December 10, 2024

ఈ నెల శాసనసభ, మండలి సభ్యులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం

image

జూబ్లిహిల్స్ MCRHRDలో డిసెంబర్ 11,12 తేదీలలో తెలంగాణ శాసనసభ, శాసన మండలి సభ్యులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం ఉంటుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఓరియంటేషన్ ప్రోగ్రాంకి సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం వారు కలిసి పరిశీలించారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఈ అవగాహన కార్యక్రమానికి తప్పని సరిగా హాజరుకావాలని ఈ సందర్భంగా వారు సూచించారు.

News December 10, 2024

విద్యార్థులకు భారంగా మారిన దోస్త్‌ను ఎత్తివేయాలి: పీడీఎస్యూ

image

రాష్ట్రంలో విద్యార్థులకు భారంగా మారిన దోస్త్ విధానాన్ని ఎత్తేయాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ ప్రొ.పురుషోత్తమ్‌కు విద్యార్థి నేతలు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ విధానంలో లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సరైన అవగాహన లేక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.