News February 23, 2025

HYD: చీర కట్టి.. పరుగు పెట్టి..!

image

‘చీరలోని గొప్పతనం తెలుసుకో.. ఆ చీర కట్టి ఆడతనం పెంచుకో’ అనే పాట వినే ఉంటారు. చీర కట్టుతో అందంగా కనిపించడమే కాదు ఫిట్‌నెస్ కూడా సాధ్యమేనని పలువురు మహిళలు చాటి చెప్పారు. HYD నెక్లెస్ రోడ్డులో ఆదివారం ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో శారీ రన్(SAREE RUN) నిర్వహించారు. ఈ వాకథాన్‌లో 3,120 మంది మహిళలు చీరకట్టుతో పాల్గొన్నారు. వీరిలో ఓ మహిళ తన బిడ్డతో పాటు పాల్గొని పరుగులు పెట్టడం అందరినీ ఆకర్షించింది.

Similar News

News February 24, 2025

హార్దిక్ పాండ్య వాచ్ ధర ఎంతో తెలుసా?

image

పాక్‌తో మ్యాచులో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ధరించిన చేతి గడియారం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వాచ్ ఫొటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది. రిచర్డ్ మిల్లె కంపెనీకి చెందిన ఈ వాచ్ రిటైల్ ధర ₹1.50కోట్లకు పైగా ఉంటుంది. రఫెల్ నాదల్, విరాట్ కోహ్లీ, క్రిస్టియానో ​​రొనాల్డో వంటి క్రీడాకారులతో పాటు సినీ హీరో రామ్ చరణ్ ఈ గడియారాన్ని కలిగి ఉన్నట్లు సమాచారం.

News February 24, 2025

అలారం పెట్టుకొని నిద్ర లేస్తున్నారా?

image

అలారం పెట్టుకొని నిద్ర నుంచి ఉలిక్కిపడి లేవడం వల్ల బీపీ పెరిగే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడైంది. ఇది హార్ట్ బీట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. దీంతో శ్వాస ఆడకపోవడం, ఆందోళన, తలనొప్పి రావొచ్చని పేర్కొంది. వీలైతే న్యాచురల్‌గా నిద్ర లేవడం, అలారం సౌండ్ తక్కువగా పెట్టుకోవడం చేయాలని సూచించింది.

News February 24, 2025

ఉప్పల్: పదవ తరగతి చదువుతున్నారా..? మీకోసమే!

image

పదవ తరగతి పూర్తయ్యాక డైరెక్ట్ ఇంజనీరింగ్ విద్యను డిప్లమా లెవెల్లో అభ్యసించడం కోసం పాలిటెక్నిక్ విద్య అందుబాటులో ఉంది. ఇందు కోసం పాలీసెట్ ప్రవేశ పరీక్ష మే 16వ తేదీన జరుగుతుందని రామంతపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ అధికారులు తెలిపారు. ఇందుకు ఇప్పటి నుంచి విద్యార్థులు ప్రిపేర్ అయితే మంచిగా రాణించే అవకాశాలు ఉంటాయన్నారు. 

error: Content is protected !!