News March 22, 2025
HYD: పదోన్నతి.. ఇంతలోనే అడిషనల్ DCP మృతి

హయత్‌నగర్‌లో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అడిషనల్ DCP బాబ్జీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల పోలీస్ శాఖ తీవ్ర సంతాపం ప్రకటించింది. మార్చి 18న ఆయన అడిషనల్ SP ర్యాంక్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. ఇంతలోనే మృతి చెందడాన్ని కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్ద అంబర్‌పేటలో నివాసం ఉండే బాబ్జీకి ఉదయం వాకింగ్ చేయడం అలవాటు. ఈ క్రమంలోనే హైవే మీద రోడ్డు దాటుతుండగా బస్సు ఢీ కొట్టింది.
Similar News
News March 25, 2025
ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు సంపూర్ణ సహకారం అందించాలి: కలెక్టర్

రబీ ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో రబీ ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లు, పౌరసరఫరాలు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లర్ల సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు సానుకూలతతో ఉంటుందని తెలిపారు.
News March 25, 2025
టేకుమట్ల: ఘోర రోడ్డు ప్రమాదం (UPDATE)

టేకుమట్ల మండలంలోని రామకృష్ణాపూర్(టి) సమీపంలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదంలో వరి పొలంలో పనికి సిద్ధమవుతున్న కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ క్రమంలో మోకిడి సంధ్య (30), పూలమ్మ (51) అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబంలో ప్రేమానురాగాలు పంచే తల్లులు మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి పిల్లల రోదనలు మిన్నంటాయి.
News March 25, 2025
BIG NEWS: ఏప్రిల్ 1 నుంచి ‘సదరమ్’ స్లాట్లు

AP: దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సామాజిక పింఛన్ల తనిఖీ కోసం కొంతకాలంగా నిలిపివేసిన సదరమ్ స్లాట్లను ఏప్రిల్ 1 నుంచి పున:ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన ఏరియా, జిల్లా, టీచింగ్ ఆస్పత్రులు/GGHలలో ప్రతి మంగళవారం స్లాట్‌లు అందుబాటులో ఉంటాయని సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఎ.సిరి తెలిపారు. పరీక్షల అనంతరం అర్హులకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని పేర్కొన్నారు.