News September 25, 2024

హైదరాబాద్-అయోధ్య విమాన సర్వీసులు

image

శంషాబాద్ నుంచి రాముడి జన్మస్థానమైన అయోధ్యకు ఈ నెల 27 నుంచి ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వారంలో నాలుగు రోజులు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ నెల 28 నుంచి ప్రయాగ్ రాజ్, ఆగ్రాకు కూడా రెండు సర్వీసులను ఇండిగో ప్రారంభించనుంది. వారంలో 3 రోజులు ఈ విమానాలు తిరుగుతాయి. అటు ప్రతి సోమ, మంగళవారాల్లో అగర్తల, జమ్మూలకు విమాన సర్వీసులు ఉంటాయని ఇండిగో ప్రకటించింది.

Similar News

News September 25, 2024

బాలుగారి మధుర గాత్రం చెవులకు వినిపిస్తూనే ఉంది: సీఎం

image

AP: గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. ‘సినీ సంగీత చరిత్రలో ఒక సువర్ణ శకాన్ని తన పరం చేసుకున్న మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. మైమరపింపజేసే ఆయన మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉంది. బాలుగారి వర్ధంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళి అర్పిస్తున్నాను’ అని సీఎం ట్వీట్ చేశారు.

News September 25, 2024

కమలా హారిస్ క్యాంపెయిన్ ఆఫీస్‌పై కాల్పులు

image

అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అరిజోనా క్యాంపెయిన్ ఆఫీస్‌పై కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 16 అర్ధరాత్రి తర్వాత ఇలా జరగడం రెండోసారి అన్నారు. ఆఫీస్ ముందున్న విండోస్‌పై బుల్లెట్ హోల్స్ గుర్తించామన్నారు. BB గన్ లేదా పెల్లెట్ గన్‌తో పేల్చినట్టు వారు అనుమానిస్తున్నారు. ‘రాత్రి కావడంతో ఆఫీసులో ఎవరూ లేరు. అక్కడ పనిచేస్తున్న వారి భద్రతపై ఆందోళన కలుగుతోంది’ అని వారు పేర్కొన్నారు.

News September 25, 2024

Stock Market: పైకా.. కిందకా..

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ఎలాంటి సిగ్నల్స్ అందలేదు. సూచీలు గరిష్ఠాలకు చేరడంతో ఇన్వెస్టర్లు అలర్ట్‌గా ఉంటున్నారు. కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 84,963 (+40), ఎన్ఎస్ఈ నిఫ్టీ 25,945 (+5) వద్ద ట్రేడవుతున్నాయి. స్మాల్, మిడ్ క్యాప్ సూచీలూ అలాగే ఉన్నాయి. పవర్ గ్రిడ్, M&M, హిందాల్కో, HDFC బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు టాప్ గెయినర్స్.