News September 25, 2024

హైదరాబాద్-అయోధ్య విమాన సర్వీసులు

image

శంషాబాద్ నుంచి రాముడి జన్మస్థానమైన అయోధ్యకు ఈ నెల 27 నుంచి ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వారంలో నాలుగు రోజులు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ నెల 28 నుంచి ప్రయాగ్ రాజ్, ఆగ్రాకు కూడా రెండు సర్వీసులను ఇండిగో ప్రారంభించనుంది. వారంలో 3 రోజులు ఈ విమానాలు తిరుగుతాయి. అటు ప్రతి సోమ, మంగళవారాల్లో అగర్తల, జమ్మూలకు విమాన సర్వీసులు ఉంటాయని ఇండిగో ప్రకటించింది.

Similar News

News July 10, 2025

టాస్ ఓడిన భారత్.. జట్టులోకి బుమ్రా

image

లార్డ్స్‌ వేదికగా టీమ్ ఇండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియాలో ప్రసిద్ధ్ స్థానంలో బుమ్రా జట్టులోకి వచ్చారు. IND(XI): జైస్వాల్, రాహుల్, నాయర్, గిల్, పంత్(Wk), జడేజా, సుందర్, ఆకాశ్ దీప్, సిరాజ్, బుమ్రా, నితీశ్. ENG(XI): క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్, స్మిత్(Wk), వోక్స్, కార్స్, ఆర్చర్, బషీర్.

News July 10, 2025

గాల్లో ఢీకొన్న విమానాలు.. ఇద్దరి మృతి

image

కెనడాలో విమానాలు ఢీకొన్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రెండు శిక్షణ విమానాలు గాల్లో ఢీకొనగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన శ్రీహరి సుకేశ్ (21)తో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. సుకేశ్ కేరళ వాసిగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సుకేశ్ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేసింది.

News July 10, 2025

అనుమతి లేకుండా ఇతరుల ఫొటోలు షేర్ చేస్తున్నారా?

image

బెంగళూరులో అనుమతి లేకుండా యువతి వీడియోను తీసి SMలో షేర్ చేసిన 26 ఏళ్ల యువకుడు అరెస్టయ్యాడు. యువతి ఫొటోలు, వీడియోలు అసభ్య కామెంట్లతో వైరలవ్వగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66E ప్రకారం ఇతరుల ఫొటోలను SMలో వారి అనుమతి లేకుండా షేర్ చేయడం నేరం. దీని ప్రకారం గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు.