News March 20, 2024
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్!
చదువు కోసం USలోని ఓహియో రాష్ట్రానికి వెళ్లిన అబ్దుల్ మహ్మద్ అనే హైదరాబాద్ విద్యార్థిని దుండగులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్ మాఫియాకి చెందిన కొందరు అబ్దుల్‌ను కిడ్నాప్ చేశారని గుర్తుతెలియని వ్యక్తుల నుంచి గతవారం అబ్దుల్ తల్లిదండ్రులకు ఫోన్ వచ్చిందట. $1200 (రూ.99,750) ఇవ్వాలని లేదంటే బాధితుడి కిడ్నీ అమ్మేస్తామని బెదిరించారని సమాచారం. దీనిపై అక్కడున్న అబ్దుల్ బంధువులు పోలీసులను ఆశ్రయించారు.
Similar News
News September 18, 2024
ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం: మంత్రి శ్రీధర్ బాబు
TG: రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సంగుపేట(సంగారెడ్డి), మద్దూరు(నారాయణ పేట), అడవి శ్రీరాంపూర్(పెద్దపల్లి) గ్రామాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నట్లు మీడియాతో చెప్పారు. ఇంటర్నెట్‌తో పాటు కేబుల్ టీవీ సేవలు, 20 MBPS అపరిమిత డేటా ఆప్టికల్ ఫైబర్ ద్వారా అందిస్తామన్నారు. ఇప్పటి వరకు 8వేల గ్రామాలకు ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
News September 18, 2024
‘హిరోషిమా’పై జేమ్స్ కామెరూన్ మూవీ?
వరల్డ్ వార్-2లో హిరోషిమా, నాగసాకిలపై US అణుబాంబులతో దాడి చేసినప్పుడు జపాన్ ఇంజినీర్ సుటోము యమగుచి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన జీవితంపై US రచయిత చార్లెస్ ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’ అనే బుక్ రాశారు. అదే పేరుతో హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సినిమా చేస్తారని టాక్. అవతార్ 3, 4, 5 చిత్రాల తర్వాత చేస్తారా? లేక ముందే తీస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
News September 18, 2024
పింఛన్ల పంపిణీపై కీలక నిర్ణయం
AP: పింఛన్ పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం సవరణలు చేసింది. 1వ తేదీ సెలవు రోజుగా ఉంటే ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు అందించాలని పేర్కొంది. రెండో తేదీన మిగిలిన పంపిణీ పూర్తిచేయాలని, ఆ రోజూ సెలవు ఉంటే మూడో తేదీన పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. పంపిణీని ప్రారంభించిన తొలి రోజే దాదాపు 100 శాతం పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని ఆదేశించింది.