News August 30, 2024
‘హైడ్రా భయమా’.. ఈ బిజినెస్ స్ట్రాటజీ చూశారా?

చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మించిన ఇళ్లను ‘హైడ్రా’ కూల్చివేస్తుండటంతో తమ ఇళ్లు FTL, బఫర్ జోన్ల పరిధిలో ఉన్నాయేమోనని ప్రజలు భయపడుతున్నారు. ఈక్రమంలో వారి భయాన్ని బిజినెస్‌గా మలుచుకునేందుకు కొందరు సిద్ధమయ్యారు. హైడ్రాకు భయపడొద్దని, ఇంటిని కంటైనర్లతో నిర్మించుకుంటే కూల్చేయకుండా తరలించవచ్చని ప్రకటనలు చేస్తున్నారు. దీంతో కొందరి భయం.. మరికొందరికి బిజినెస్‌గా మారిందని నెట్టింట చర్చ జరుగుతోంది.
Similar News
News September 13, 2025
తగ్గిన సబ్బులు, షాంపూల ధరలు

GST సవరణ నేపథ్యంలో ప్రముఖ FMCG బ్రాండ్ హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) తమ ఉత్పత్తుల ధరలు తగ్గించింది. రూ.490 ఉండే డవ్ షాంపూ(340ml) రూ.435కే లభించనుంది. రూ.130 హార్లిక్స్ జార్(200g) రూ.110, రూ.68 లైఫ్‌బాయ్ సబ్బు(75gX4) రూ.60, రూ.96 లక్స్ సబ్బు(75gX4) రూ.85, రూ.300 బ్రూ (75g) రూ.284, రూ.124 బూస్ట్(200g) రూ.110, రూ.154 క్లోజప్ (150g) రూ.129కే అందుబాటులో ఉంటాయి. ఈ నెల 22 నుంచి ఈ ధరలు అమలవుతాయి.
News September 13, 2025
హైదరాబాద్ మిధానీలో ఉద్యోగాలు

HYDలోని మిశ్ర ధాతు నిగమ్<
News September 13, 2025
యుద్ధం తర్వాత తొలి మ్యాచ్.. స్టేడియం హౌస్‌ఫుల్: అక్తర్

ఆసియా కప్‌లో రేపు భారత్‌తో జరగనున్న మ్యాచ్‌కు టికెట్స్ సేల్ అవ్వట్లేదన్న వార్తలపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించారు. ‘భావోద్వేగాలు ఉప్పొంగుతున్నాయి. యుద్ధం తర్వాత భారత్‌తో పాక్ తొలిసారి తలపడుతోంది. కచ్చితంగా స్టేడియం హౌస్‌ఫుల్ అవుతుంది. టికెట్లు అమ్ముడవ్వట్లేదని నాతో ఒకరన్నారు. అది వాస్తవం కాదని, అన్నీ సేల్ అయ్యాయని చెప్పాను. ఇదంతా బయట జరుగుతున్న ప్రచారం మాత్రమే’ అని వ్యాఖ్యానించారు.