News August 30, 2024

‘హైడ్రా భయమా’.. ఈ బిజినెస్ స్ట్రాటజీ చూశారా?

image

చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మించిన ఇళ్లను ‘హైడ్రా’ కూల్చివేస్తుండటంతో తమ ఇళ్లు FTL, బఫర్ జోన్‌ల పరిధిలో ఉన్నాయేమోనని ప్రజలు భయపడుతున్నారు. ఈక్రమంలో వారి భయాన్ని బిజినెస్‌గా మలుచుకునేందుకు కొందరు సిద్ధమయ్యారు. హైడ్రాకు భయపడొద్దని, ఇంటిని కంటైనర్లతో నిర్మించుకుంటే కూల్చేయకుండా తరలించవచ్చని ప్రకటనలు చేస్తున్నారు. దీంతో కొందరి భయం.. మరికొందరికి బిజినెస్‌గా మారిందని నెట్టింట చర్చ జరుగుతోంది.

Similar News

News February 14, 2025

స్కూలు విద్యార్థులకు శుభవార్త

image

AP: BC విద్యార్థుల ₹110.52 కోట్ల డైట్ బకాయిలు, ₹29 కోట్ల కాస్మోటిక్ బిల్లులు చెల్లించాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ₹13.10 కోట్లతో 660 హాస్టళ్లలో చేపట్టిన మరమ్మతులు 6 వారాల్లో పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, కిచెన్ ఐటెమ్స్ అందించాలని సూచించారు. నసనకోట, ఆత్మకూరు BC సంక్షేమ బాలికల పాఠశాలలను రెసిడెన్షియల్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని చెప్పారు.

News February 14, 2025

ఆటవిక పాలనలోనే దాడులు, హత్యలు: సీఎం

image

AP: నేరస్థులు రాజకీయాల్లో ఉంటే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అని CM చంద్రబాబు చెప్పారు. ఐదేళ్లు ప్రజాస్వామ్యాన్ని చంపి ఇప్పుడు కొత్తదారులు వెతుకుతున్నారని వైసీపీ నేతలను విమర్శించారు. అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మించాలనేది వారి తాపత్రయమన్నారు. ఆటవిక పాలనలోనే దాడులు, విధ్వంసాలు, హత్యలు జరుగుతాయని తెలిపారు. తాము ప్రజాస్వామ్యవాదులమని, చట్టబద్ధంగా పాలన చేస్తున్నామని పేర్కొన్నారు.

News February 14, 2025

నీ సంకల్పం గొప్పది బ్రో..!

image

సివిల్ సర్వెంట్ కావాలనేది ఎంతో మంది కల. దీనికి ఎంతో కష్టమైన UPSC పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వాల్సిందే. కొందరు నాలుగైదు అటెంప్ట్స్‌లో, మరికొందరు ఒక్కసారికే సివిల్ సర్వెంట్ అయిపోతుంటారు. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన శ్రీవాస్తవ(48) ఇప్పటివరకు UPSC, MPPSC కలిపి 73 సార్లు ప్రిలిమ్స్, 43సార్లు మెయిన్స్, 8 సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లినా ఉద్యోగం పొందలేకపోయారు. ప్రతిసారి నిరాశే ఎదురైనా ప్రిపరేషన్ కొనసాగించారు.

error: Content is protected !!