News September 9, 2024
హైడ్రా ఫిర్యాదు.. ముందస్తు బెయిల్ కోసం అధికారుల పిటిషన్లు

TG: అక్రమ నిర్మాణాల అనుమతులకు సంబంధించి పలువురు ప్రభుత్వ అధికారులపై సైబరాబాద్ ఆర్థిక విభాగం పోలీసులకు హైడ్రా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో చందానగర్, బాచుపల్లి పరిధిలోని కొందరు ప్రభుత్వ అధికారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయా ఆఫీసర్లు కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వారికి బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోర్టుని కోరారు.
Similar News
News November 20, 2025
NLR: టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు జిల్లాలోని డాక్టర్ BRఅంబేడ్కర్ గురుకుల పాఠశాలలో పార్ట్ టైం టీచర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ ప్రభావతి ఓ ప్రకటనలో తెలిపారు. బీఈడీతో పాటు పీజీ పాసైన వాళ్లు అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు శనివారంలోపు నెల్లూరు పాత జూబ్లీ ఆస్టిల్ ఆవరణలోని కోఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. సోమవారం ఉదయం 11 గంటల్లోపు డెమోకు హాజరు కావాలని సూచించారు.
News November 20, 2025
405Kmph.. రికార్డులు బద్దలు కొట్టిన మెలిస్సా

కరీబియన్ దీవులను ధ్వంసం చేసిన <<18174610>>మెలిస్సా<<>> హరికేన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 252mph(405Kmph) వేగంతో విరుచుకుపడినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది అత్యంత శక్తిమంతమైన హరికేన్ వేగమని NSF NCAR వెల్లడించింది. జమైకా వైపు దూసుకెళ్తున్న సమయంలో ఈ రికార్డు నమోదైంది. 2010లో తైవాన్ సమీపంలో టైఫూన్ మెగీ నమోదు చేసిన 248mph రికార్డును మెలిస్సా అధిగమించింది. దీని ప్రభావంతో 70 మందికిపైగా మృతి చెందారు.
News November 20, 2025
సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్.. ఇవాళే లాస్ట్ డేట్

ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు CBSE ప్రత్యేక స్కాలర్షిప్ని అందిస్తోంది. నేటితో దరఖాస్తు గడువు ముగుస్తోంది. పదోతరగతిలో 70%మార్కులు వచ్చి ప్రస్తుతం CBSE అనుబంధ పాఠశాలల్లో 11th చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్షిప్కు అప్లై చేసుకోవచ్చు. గతేడాది ఎంపికైన విద్యార్థినులూ రెన్యువల్ చేసుకోవచ్చు. ప్రతి నెలా ₹1000 చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు. వెబ్సైట్ <


