News September 9, 2024
హైడ్రా ఫిర్యాదు.. ముందస్తు బెయిల్ కోసం అధికారుల పిటిషన్లు
TG: అక్రమ నిర్మాణాల అనుమతులకు సంబంధించి పలువురు ప్రభుత్వ అధికారులపై సైబరాబాద్ ఆర్థిక విభాగం పోలీసులకు హైడ్రా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో చందానగర్, బాచుపల్లి పరిధిలోని కొందరు ప్రభుత్వ అధికారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయా ఆఫీసర్లు కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వారికి బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోర్టుని కోరారు.
Similar News
News October 10, 2024
పాత రూల్స్‌తో మళ్లీ టీటీడీలో టెండర్లు: YCP
AP: టీటీడీలో మళ్లీ పాత నిబంధనలతోనే కూటమి సర్కార్ నెయ్యి కొనుగోలుకు నోటిఫికేషన్ ఇచ్చిందని వైసీపీ పేర్కొంది. ‘నెయ్యిలో కల్తీ జరిగిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. గతంలో జగన్ ప్రభుత్వం విధించిన నిబంధనలు మార్చకుండా మళ్లీ అవే రూల్స్‌తో టెండర్లు పిలిచారు. అంటే వైసీపీ ప్రభుత్వం గట్టి నిబంధనలు అమలు చేసినట్లే కదా. కల్తీకి ఆస్కారం లేనట్లే కదా. సమాధానం చెప్పు చంద్రబాబు’ అని Xలో ప్రశ్నించింది.
News October 10, 2024
కొండా సురేఖకు కోర్టు నోటీసులు
TG: నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. కొండా సురేఖ అసత్య ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
News October 10, 2024
TEAM INDIA: మనల్ని ఎవడ్రా ఆపేది!
ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలోనూ టీమ్ ఇండియాకు ఎదురే లేకుండా పోయింది. అటు టెస్టుల్లో, ఇటు టీ20ల్లో వరుస విజయాలు సాధిస్తోంది. ఈ ఏడాది 8 టెస్టులు ఆడగా ఒక్క మ్యాచ్‌లోనే ఓడి ఏడింట్లో జయకేతనం ఎగరేసింది. మరోవైపు 21 టీ20లు ఆడి ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓటమి పాలైంది. కాగా ఈ ఏడాది భారత్ 3 వన్డేలే ఆడినా రెండిట్లో ఓడి ఒకటి టై చేసుకుంది. అటు టెస్టుల్లో రోహిత్ శర్మ, ఇటు టీ20ల్లో సూర్యకుమార్ సారథ్యంలో భారత్ దూసుకుపోతోంది.