News August 25, 2024

మరిన్ని నగరాలకు హైడ్రా?

image

TG: హైడ్రా తరహా వ్యవస్థను మరిన్ని నగరాల్లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కరీంనగర్, WL, NZB, KMM, సిద్దిపేట, ADB, MBNR, NRML, NLG, గద్వాల, కామారెడ్డి సహా పలు నగరాలు, పట్టణాల్లో చెరువులు, శిఖం భూములు, బఫర్ జోన్లలో అడ్డగోలుగా నిర్మాణాలు జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. దీంతో చెరువులు, కుంటల రక్షణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం హైడ్రా వంటి వ్యవస్థతో వాటిని సంరక్షించాలని భావిస్తోంది.

Similar News

News September 19, 2024

అఫ్గానిస్థాన్ సంచలనం

image

వన్డే క్రికెట్‌లో అఫ్గానిస్థాన్ సంచలనం సృష్టించింది. దక్షిణాఫ్రికాపై తొలి సారి విజయం సాధించింది. యూఏఈలో సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలిచి అఫ్గాన్ రికార్డు సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్.. అఫ్గాన్ బౌలర్ల ధాటికి 106 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 107 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్ 26 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

News September 19, 2024

నేను త్వరగా రిటైర్ అయ్యానేమో: ఫెదరర్

image

తాను త్వరగా రిటైర్ అయిపోయానని తనకు తరచూ అనిపిస్తుంటుందని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. టెన్నిస్ కోర్టుకు వచ్చినప్పుడల్లా తాను ఇంకా ఆడగలనని అనుకుంటానని పేర్కొన్నారు. ‘నాలో ఇంకా ఆట ఉంది. కానీ ఇంట్లో ఉండటం సౌకర్యంగా ఉంది. టూర్లు తిరగనవసరం లేదన్న విషయం గుర్తొచ్చినప్పుడు రిలీఫ్‌గా ఉంటుంది’ అని వెల్లడించారు. తన తోటి దిగ్గజం నాదల్ రిటైర్మెంట్‌పై అంచనా వేయలేనని స్పష్టం చేశారు.

News September 19, 2024

బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు: TTD అదనపు ఈవో

image

AP: తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 8న నిర్వహించే గరుడ వాహన సేవ ఏర్పాట్లపై TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష జరిపారు. ఆ రోజున భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సమయం(OCT 4-12)లో ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. OCT 7న ఉ.6 గంటల నుంచి కొండపైకి బైకుల్ని నిలిపివేస్తామని, తిరిగి 9వ తేదీన ఉ.6 గం.కు అనుమతిస్తామన్నారు.