News August 25, 2024

‘హైడ్రా’ స్కెచ్ వేసిందంటే..

image

HYDలో హైడ్రా దాదాపు నెలరోజుల్లోనే 100 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. కమిషనర్ రంగనాథ్ చెరువుల ఆక్రమణపై అవగాహన కోసం రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా శాటిలైట్ చిత్రాలు తెప్పించుకున్నారు. ముందుగానే సిబ్బంది మఫ్టీలో వెళ్లి భవనాలు, కట్టడాలు పరిశీలించి వస్తారు. రాత్రి యంత్రాలు, సిబ్బందిని సిద్ధం చేసి ఉదయమే కూల్చివేతలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా శని, ఆదివారాలు ప్లాన్ చేసుకుంటారు.

Similar News

News September 13, 2024

విరాట్ వచ్చేశాడు.. ప్రాక్టీస్ మొదలు

image

ఈమధ్య కాలంలో లండన్‌‌లోనే ఉంటున్న విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చారు. బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టుల కోసం చెన్నైలో నెట్స్‌లో 45 నిమిషాల పాటు చెమటోడ్చారు. కోచ్ గంభీర్ పర్యవేక్షణలో భారత ఆటగాళ్లందరూ సాధన చేశారు. ఈ నెల 19న చెన్నైలో బంగ్లాతో తొలి టెస్టు మొదలుకానుంది. నగరంలో విరాట్ మూడేళ్ల తర్వాత తొలిసారిగా టెస్టు ఆడనున్నారు. అక్కడ 4 టెస్టుల్లో ఒక సెంచరీతో 267 పరుగులు చేశారు.

News September 13, 2024

మాపై ఆరోపణలు పచ్చి అబద్ధం: సెబీ చీఫ్

image

తమపై వచ్చిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని సెబీ చీఫ్ మాధబీ బుచ్ అన్నారు. సంస్థ రూల్స్, గైడ్‌లైన్స్ అన్నీ పాటించానని చెప్పారు. ‘మా IT రిటర్నులను మోసపూరితంగా పొందడం అక్రమం. ఇది ప్రాథమిక హక్కైన మా గోప్యత, IT చట్టాన్ని ఉల్లంఘించడమే’ అని స్పష్టం చేశారు. సెబీలో పనిచేస్తూనే మాధబి తన అగోరా అడ్వైజరీ ద్వారా ICICI, M&M, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల నుంచి ఆదాయం పొందారని కాంగ్రెస్, హిండెన్‌బర్గ్ ఆరోపించడం తెలిసిందే.

News September 13, 2024

యూపీలో మరో మహిళపై తోడేలు దాడి

image

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో మరోసారి ఓ మహిళ(28)పై తోడేలు దాడి చేసింది. ఈ దాడిలో బాధితురాలి మెడ, ఛాతీకి తీవ్రగాయాలయ్యాయి. ఆరు తోడేళ్లలో అధికారులు ఐదింటిని పట్టుకోగా, మరొకటి ఎంత ప్రయత్నించినా దొరకడం లేదు. అది గత 4 రోజులుగా దాడులు చేస్తోంది. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఆరో తోడేలును పట్టుకోవడం కష్టమవుతోందని అధికారులు వివరిస్తున్నారు.