News September 8, 2024

నటుడు మురళీ మోహన్‌కు హైడ్రా నోటీసులు

image

TG: సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్‌కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లోని రంగలాల్ కుంట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు తొలగించాలని నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లోగా కూల్చకపోతే తామే కూలుస్తామని హైడ్రా హెచ్చరించింది.

Similar News

News October 14, 2024

శుభ ముహూర్తం

image

తేది: అక్టోబర్ 14, సోమవారం
ఏకాదశి: ఉదయం.6.41 గంటలకు
ద్వాదశి: రాత్రి 3.41 గంటలకు
శతభిష: రాత్రి 12.42 గంటలకు
వర్జ్యం: ఉదయం 9.24-10.52 గంటలకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.16-1.03 గంటల వరకు,
మధ్యాహ్నం 2.37-3.24 గంటల వరకు

News October 14, 2024

ఈజిప్షియన్ ఎడారుల్లో వేల ఏళ్ల నాటి రాతివృత్తం

image

పురాతన మనుషుల జీవన విధానానికి సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా, ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇటీవల ఈజిప్షియన్ ఎడారుల్లో ఓ రాతి వృత్తాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిని ఖగోళ అబ్జర్వేటరీగా ప్రాచీనులు ఉపయోగించి ఉంటారని తెలిపారు. 7,500 ఏళ్ల క్రితం నివసించిన నుబియన్‌లు దీనిని క్యాలెండర్ సర్కిల్‌గా ఉపయోగించేవారన్నారు. దీంతో కాలాల గమనం, కాలానుగుణంగా పెరిగే ప్రకాశవంతమైన నక్షత్రాల గురించి తెలుసుకునేవారు.

News October 14, 2024

TODAY HEADLINES

image

*అల్పపీడనం.. దక్షిణకోస్తాకు భారీ వర్షసూచన
*ఇసుక ధరలు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి?: జగన్
*టన్ను ఇసుక రూ.475కే ఇచ్చావా?.. ఎవరికిచ్చావ్?: టీడీపీ
*AP: రేపు మద్యం దుకాణాలకు లాటరీ
*JAC ఏర్పాటుకు అలయ్ బలయ్ స్ఫూర్తి: CM రేవంత్
*కాంగ్రెస్ నేతల్ని ఈడీ కేసుల నుంచి రక్షిస్తున్న బిగ్ బ్రదర్ ఎవరు?: KTR
*MH మాజీ మంత్రి సిద్దిఖీ హత్య మా పనే: బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన
*రూ.500 కోట్ల క్లబ్‌లో దేవర మూవీ