News August 27, 2024
సలకం చెరువును పరిశీలించిన హైడ్రా అధికారులు

TG: హైదరాబాద్ చాంద్రాయణగుట్టలోని సలకం చెరువును హైడ్రా అధికారులు పరిశీలించారు. చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు రావడంతో అధికారులు అక్కడికి వెళ్లారు. మరోవైపు ఆ ఆక్రమణలు తొలగించాలని GHMC బీజేపీ కార్పొరేటర్లు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు చెరువులో ఫాతిమా కాలేజీని నిర్మించారని పేర్కొన్నారు.
Similar News
News January 6, 2026
కుజ దోష నివారణకు శుభప్రదం ‘మంగళ వారం’

జాతకంలో కుజ దోషంతో సమస్యలు ఎదుర్కొనే వారు మంగళవారం నాడు ప్రత్యేక పూజలు చేయడం విశేష ఫలితాలుంటాయి. కుజుడికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని, హనుమంతుడిని ఆరాధిస్తే దోష తీవ్రత తగ్గుతుంది. ఎరుపు దుస్తులు ధరించి పూజ చేయాలి. కందులు దానం చేయడం, కుజ అష్టోత్తరం పఠించడం వల్ల జాతకంలోని ప్రతికూలతలు తొలగి సుఖశాంతులు చేకూరుతాయి. భక్తితో చేసే ఈ పరిహారాలు మానసిక ధైర్యాన్ని ఇచ్చి కార్యసిద్ధికి మార్గం చూపుతాయి.
News January 6, 2026
ఇంటర్వ్యూతో ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

ఏపీ: మంగళగిరిలోని <
News January 6, 2026
రష్యా నుంచి మాకు ఆయిల్ రావడం లేదు: రిలయన్స్

రష్యా నుంచి తమ జామ్నగర్ రిఫైనరీకి ముడి చమురు నౌకలు వస్తున్నాయన్న వార్తలను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఖండించింది. వాటిల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. గత 3 వారాలుగా తాము రష్యన్ ఆయిల్ కార్గోను స్వీకరించలేదని, జనవరిలో కూడా అక్కడి నుంచి చమురు వచ్చే అవకాశం లేదని వెల్లడించింది. తాము ముందే క్లారిటీ ఇచ్చినప్పటికీ తప్పుడు కథనాలను పబ్లిష్ చేయడం వల్ల తమ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేసింది.


