News August 27, 2024

సలకం చెరువును పరిశీలించిన హైడ్రా అధికారులు

image

TG: హైదరాబాద్ చాంద్రాయణగుట్టలోని సలకం చెరువును హైడ్రా అధికారులు పరిశీలించారు. చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు రావడంతో అధికారులు అక్కడికి వెళ్లారు. మరోవైపు ఆ ఆక్రమణలు తొలగించాలని GHMC బీజేపీ కార్పొరేటర్లు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు చెరువులో ఫాతిమా కాలేజీని నిర్మించారని పేర్కొన్నారు.

Similar News

News September 17, 2024

ఇరాన్ సుప్రీం లీడర్‌కు భారత్ కౌంటర్

image

భారత్, గాజా, మయన్మార్ వంటి దేశాల్లో ముస్లింల పరిస్థితిని ఉద్దేశించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఆయన వ్యాఖ్యలను స్వీకరించబోమని విదేశాంగ శాఖ Xలో ట్వీట్ చేసింది. మైనార్టీలను ఉద్దేశించి మాట్లాడే దేశాలు తమ దేశంలోని పరిస్థితులను ముందుగా పరిశీలించుకోవాలని చురకలు అంటించింది.

News September 17, 2024

ఢిల్లీలో మరో అంతర్జాతీయ స్టేడియం

image

ఢిల్లీలో కొత్తగా ద్వారక అంతర్జాతీయ స్టేడియం నిర్మించనున్నారు. దీనిని క్రికెట్ కమ్ ఫుట్‌బాల్ స్టేడియంగా DDA (ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ) రూపొందించనుంది. రూ.1,500 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ స్టేడియంలో స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, టీటీ వంటి ఆటలు ఆడేందుకు సౌకర్యాలు ఉంటాయి. 30 వేల మంది కెపాసిటీతో దీనిని నిర్మిస్తారు. ఈ ఏడాది చివర్లో పనులు ప్రారంభించి 2027 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తారు.

News September 17, 2024

జానీ మాస్టర్ భార్య కూడా దాడి చేశారు: బాధితురాలు

image

జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణల కేసులో అతని భార్య వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో మాస్టర్ భార్య కూడా తనను వేధించినట్లు బాధితురాలు పేర్కొంది. అతని కోరిక తీర్చకపోతే బలవంతంగా దాడికి తెగబడేవాడని ఆమె తెలిపింది. వేధింపులు భరించలేక బయటకు వెళ్లి వేరే పని చేసుకుంటుంటే జానీ మాస్టర్, ఆయన భార్య తన ఇంటికి వచ్చి దాడి చేశారని బాధితురాలు వెల్లడించింది.