News September 2, 2024
హైడ్రా.. సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ సపోర్ట్!
TG: హైడ్రా కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి పల్లంరాజు సోదరుడికి చెందిన ORO స్పోర్ట్స్ కాంప్లెక్స్ హిమాయత్ సాగర్ FTLలో ఉందని హైడ్రా కూల్చేసింది. దీనిపై రాహుల్ గాంధీ వద్ద పల్లంరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే రాహుల్ మాత్రం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.
Similar News
News September 15, 2024
మా ఆర్థిక కష్టాలు తాత్కాలికమే: మాల్దీవులు
తమ ఆర్థిక కష్టాలు తాత్కాలికమేనని మాల్దీవుల ఆర్థిక మంత్రి మూసా జమీర్ తాజాగా పేర్కొన్నారు. చైనాకు దగ్గరయ్యాక ఆ దేశం అప్పుల ఊబిలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) ప్యాకేజీకి మాల్దీవులు యత్నిస్తోందంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమ అవసరాలకు, పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించే మిత్రదేశాలు తమకున్నాయని, IMF గురించి ఆలోచించడం లేదని మూసా స్పష్టం చేశారు.
News September 15, 2024
SHOCKING: అఫ్గానిస్థాన్‌లో క్రికెట్ నిషేధం?
అఫ్గానిస్థాన్‌లో క్రికెట్‌ను క్రమంగా నిషేధించాలని ఆ దేశ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. షరియా చట్టానికి క్రికెట్ హాని కలిగిస్తోందని తాలిబన్ సుప్రీం లీడర్ హిబతుల్లా భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. షరియాను మరింత కఠినంగా అమలు చేయాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. బలమైన జట్టుగా ఎదుగుతున్న అఫ్గాన్‌కు ఇది శరాఘాతమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
News September 15, 2024
ఆ గ్రహశకలం వచ్చేది నేడే!
ఓ గ్రహశకలం భూమికి అతి సమీపంగా దూసుకెళ్లనుందని నాసా చాలారోజుల క్రితమే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆ శకలం దూసుకెళ్లేది నేడే. 720 అడుగుల చుట్టుకొలత కలిగిన ఆస్టరాయిడ్ పెను వేగంతో భూమికి 6.20 లక్షల మైళ్ల దూరం నుంచి ప్రయాణించనుంది. అది భూమిని ఢీకొడుతుందని, యుగాంతమేనని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే, దాని వల్ల భూమికి ముప్పు లేనట్లేనని నాసా క్లారిటీ ఇచ్చింది.