News September 11, 2024
కూల్చివేతల వివరాలు వెల్లడించిన హైడ్రా

TG: జూన్ 27 నుంచి 262 ఆక్రమణలు తొలగించినట్లు హైడ్రా ప్రకటించింది. 23 ప్రాంతాల్లో మొత్తం 111.71 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అత్యధికంగా అమీన్పూర్లో 51 ఎకరాలు, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని సంరక్షించినట్లు వెల్లడించింది. కాగా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో HMDA పరిధిలో ఆక్రమణల కూల్చివేతలు ముమ్మరంగా సాగుతున్నాయి.
Similar News
News November 24, 2025
ధర్మేంద్ర గురించి తెలుసా?

ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. పంజాబ్ లుధియానాలోని నస్రలీ గ్రామంలో 1935 డిసెంబర్ 8న ఆయన జన్మించారు. 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరా’ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్ కింగ్గానూ పేరు గాంచిన ఆయన సినీ రంగానికి చేసిన కృషికి 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. 2005లో BJP తరఫున రాజస్థాన్లోని బికనీర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2012లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.
News November 24, 2025
ఇంటర్వ్యూతో ESICలో ఉద్యోగాలు

<
News November 24, 2025
కెనడా పౌరసత్వ చట్టంలో సవరణ.. విదేశీయులకు గుడ్న్యూస్

విదేశాల్లో పుట్టిన లేదా దత్తత తీసుకున్న చిన్నారుల పౌరసత్వంపై పరిమితులు విధిస్తూ 2009లో తెచ్చిన పౌరసత్వ చట్టంలో కెనడా సవరణ చేసింది. కొత్త చట్టం ద్వారా విదేశాల్లో పుట్టిన కెనడియన్లూ తమ సంతానానికి పౌరసత్వాన్ని బదిలీ చేసే ఛాన్స్ ఉండేలా మార్పులు చేస్తూ బిల్ సీ-3 తెచ్చింది. బిడ్డల్ని కనే ముందు 1075 రోజులు కెనడాలోనే ఉన్నట్లు ప్రూఫ్ చూపాలి. పాత చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని కెనడియన్ కోర్టు కొట్టేసింది.


