News September 11, 2024

కూల్చివేతల వివరాలు వెల్లడించిన హైడ్రా

image

TG: జూన్ 27 నుంచి 262 ఆక్రమణలు తొలగించినట్లు హైడ్రా ప్రకటించింది. 23 ప్రాంతాల్లో మొత్తం 111.71 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అత్యధికంగా అమీన్‌పూర్‌లో 51 ఎకరాలు, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని సంరక్షించినట్లు వెల్లడించింది. కాగా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో HMDA పరిధిలో ఆక్రమణల కూల్చివేతలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Similar News

News October 9, 2024

రాష్ట్రంలో 30 జిల్లాలు అని ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన CM

image

AP: రాష్ట్రంలో 30 జిల్లాలు ఏర్పాటు చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మార్కాపురం, మదనపల్లె, ఇతర కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామనే హామీలున్నాయని, కానీ ఆ ప్రక్రియ ఇప్పట్లో ఉండదని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఏపీలో 26 జిల్లాలు ఉండగా వాటిని 30కి పెంచినట్లు ఓ ఫేక్ జీవో వైరల్ అవుతోంది.

News October 9, 2024

రింకూ, నితీశ్ ఫిఫ్టీ: బంగ్లాదేశ్‌కు భారీ టార్గెట్

image

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమ్ ఇండియా భారీ స్కోర్ సాధించింది. తక్కువ స్కోరుకే మూడు వికెట్లు కోల్పోయినా నితీశ్ కుమార్ రెడ్డి (74), రింకూ సింగ్ (53) ఫిఫ్టీలతో మెరుపులు మెరిపించారు. ఇద్దరూ చెలరేగి ఆడగా, భారత్ ఓవర్లన్నీ ఆడి 221/9 రన్స్ చేసింది. చివర్లో హార్దిక్ పాండ్య (32) దూకుడుగా ఆడారు. బంగ్లా బౌలర్లలో హోస్సేన్ 3, తస్కిన్ అహ్మద్, హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ తలో రెండు వికెట్లు తీశారు.

News October 9, 2024

జో రూట్ ది గోట్ అనాల్సిందే!

image

నేటి తరం క్రికెట్‌లో విరాట్, రూట్, విలియమ్సన్, స్మిత్ అద్భుతమైన ఆటగాళ్లని క్రీడా నిపుణులు చెబుతుంటారు. అయితే రూట్ మిగిలినవారిని దాటి చాలా ముందుకెళ్లిపోయారు. గడచిన నాలుగేళ్ల రికార్డు చూస్తే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(గోట్) అనాల్సిందే. 45 నెలల్లో 50 టెస్టు మ్యాచులాడిన రూట్, దాదాపు 60 సగటుతో 5వేలకు పైగా రన్స్ చేశారు. వీటిలో 18 శతకాలున్నాయి. ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్ట్ రన్స్ జాబితాలో ఆయనదే అగ్రస్థానం.