News September 18, 2024

ఏపీలోనూ హైడ్రా ఏర్పాటు చేయాలి: CPI నారాయణ

image

AP: వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని పెంచాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. వరదలతో నష్టపోయిన విద్యార్థులకు ప్రత్యేక సాయం అందించాలన్నారు. విజయవాడలో సంభవించిన వరదలను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించేలా ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవాలన్నారు. బుడమేరును ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. ఏపీలోనూ హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News July 10, 2025

నా ఫస్ట్ లవ్ అతడితోనే: అనుష్క శెట్టి

image

తాను ఆరో తరగతిలోనే సహ విద్యార్థితో ప్రేమలో పడిపోయినట్లు హీరోయిన్ అనుష్క శెట్టి తెలిపారు. తన ఫస్ట్ లవ్ విషయాన్ని ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘ఓ రోజు నా క్లాస్‌మేట్ నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. నేను కూడా అతడికి ఓకే చెప్పా. అప్పుడు ఐ లవ్ యూ అంటే ఏంటో కూడా తెలియదు. ఆ విషయం ఇప్పటికీ నాకు ఓ మధురానుభూతి’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా అనుష్క నటించిన ‘ఘాటీ’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

News July 10, 2025

ట్రంప్‌పై డ్రోన్‌ దాడి జరగొచ్చు: ఇరాన్ అధికారి

image

ట్రంప్‌పై ఏ క్షణంలోనైనా దాడి జరగొచ్చని ఇరాన్ సీనియర్ అధికారి జావద్ లారిజనీ హెచ్చరించారు. సన్‌బాత్ చేసే సమయంలో డ్రోన్‌తో అటాక్ చేయొచ్చని బెదిరింపులకు పాల్పడ్డారు. ఫ్లోరిడాలోని నివాసం కూడా ట్రంప్‌కు సురక్షితం కాకపోవచ్చని చెప్పారు. 2020లో ఇరాన్ ఉన్నతాధికారి ఖాసీం సులేమాని హత్యలో ట్రంప్ పాత్రను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ చీఫ్ ఖమేనీని లక్ష్యంగా చేసుకున్నా ప్రతీకారం తప్పదన్నారు.

News July 10, 2025

ఆర్టీసీలో 422 కొత్త బస్సులు

image

TG: ఆర్టీసీ కొత్తగా 422 బస్సులు ప్రవేశపెట్టనుంది. కాలం చెల్లిన బస్సుల స్థానంలో 294 పల్లె వెలుగులు, 88 మెట్రో డీలక్స్‌లు, 23 డీలక్స్‌లు, 17 ఎక్స్‌ప్రెస్‌లను తీసుకురానుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరగడంతో ప్రయాణికులకు రిలీఫ్ ఇచ్చేందుకు RTC ఈ నిర్ణయం తీసుకుంది. 13-15లక్షల కి.మీ. తిరిగిన లేదా 15 ఏళ్ల కాలం దాటిన బస్సులను ఆర్టీసీ పక్కనపెట్టనుంది.