News September 8, 2024
కూల్చివేతలపై హైడ్రా సంచలన నిర్ణయం
TG: హైడ్రా <<14051102>>కూల్చివేతలపై<<>> నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఇప్పటికే నిర్మించిన ఇళ్లను కూల్చివేయబోమన్నారు. కొత్త నిర్మాణాలు మాత్రమే పరిగణనలోకి తీసుకొని కూలుస్తున్నట్లు తెలిపారు. మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. రంగనాథ్ ప్రకటనతో ఇప్పటికే ఇళ్లు నిర్మించుకొని ఉంటున్న యజమానులకు భారీ ఊరట కలిగింది.
Similar News
News October 4, 2024
ఆస్పత్రి నుంచి రజినీకాంత్ డిశ్చార్జ్
చెన్నైలోని అపోలో ఆస్పత్రి నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ నిన్న రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. 4 రోజుల క్రితం కడుపు నొప్పితో ఆయన ఆసుపత్రిలో చేరగా, రక్తనాళంలో వాపు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు స్టెంట్‌ను అమర్చారు. ఇప్పుడు ఆయన కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. రజినీ నటించిన ‘వేట్టయాన్’ ఈనెల 10న థియేటర్లలో రిలీజ్ కానుంది.
News October 4, 2024
డీఎస్పీగా నిఖత్ జరీన్
TG: బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీ యూనిఫామ్‌లో కనిపించారు. నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన చీఫ్ మినిస్టర్ కప్-2024 ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఆమెను సత్కరించి లాఠీని అందజేశారు. క్రీడల్లో రాణించిన వారిని ప్రభుత్వం ఎలా ప్రోత్సహిస్తుందో చెప్పడానికి నిఖత్ ఒక నిదర్శనం అని CM అన్నారు. బాక్సింగ్‌లో రాణించి మెడల్స్ సాధించినందుకు గాను ఆమెకు ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది.
News October 4, 2024
ALERT: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
TGలోని రంగారెడ్డి, HYD, మేడ్చల్, యాదాద్రి, SRD, ADB, NML, NZB, JN, KMR, SDPT, NRPT, MDK, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అటు APలోని ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని APSDMA తెలిపింది.