News June 14, 2024
ఐపీఓ ఫైలింగ్‌కు హ్యుందాయ్ రెడీ

ఐపీఓను అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్న హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ నేడు సెబీకి డ్రాఫ్ట్ సమర్పించనుంది. ఈ ఐపీఓతో $3 బిలియన్లు సమకూర్చుకోవాలని, సంస్థ విలువను $20 బిలియన్లకు పెంచాలని ప్లాన్ చేస్తోంది. 140 నుంచి 150 మిలియన్ షేర్లు విక్రయించనున్నట్లు తెలుస్తోంది. హ్యుందాయ్ ప్లాన్స్ సక్సెస్ అయితే ఇది దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది.
Similar News
News January 7, 2026
ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా?

ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ‘అలా చేస్తే కడుపులోని జీర్ణ రసాలు పలుచబడతాయి. దీంతో ఫుడ్ సరిగా జీర్ణం కాదు. ఫలితంగా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. నీటి అధిక పరిమాణం కడుపులో ఒత్తిడిని పెంచి, ఆహారాన్ని అరిగించాల్సిన యాసిడ్‌ను అన్నవాహికలోకి నెడుతుంది. ఫలితంగా గుండెల్లో మంటకు కారణమవుతుంది. అందుకే తిన్న తర్వాత 30-60 నిమిషాలు ఆగి వాటర్ తాగాలి’ అని సూచిస్తున్నారు.
News January 7, 2026
గాయం నుంచి కోలుకొని అదరగొట్టిన శ్రేయస్

భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ VHTలో అదరగొట్టారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత నిన్న ముంబై కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడిన ఆయన 53 బంతుల్లోనే 82 రన్స్ చేశారు. అందులో 10 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. దీంతో ఈ నెల 11 నుంచి NZతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో శ్రేయస్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోవడం ఖాయమైనట్లే. గతేడాది AUSలో వన్డే మ్యాచ్ ఆడుతూ గాయపడిన శ్రేయస్ 2 నెలల పాటు ఆటకు దూరమైన విషయం తెలిసిందే.
News January 7, 2026
రష్యా నుంచి భారత్ దిగుమతులు రూ.17లక్షల కోట్లు

ఉక్రెయిన్‌తో పూర్తిస్థాయి యుద్ధం మొదలైన నాటి నుంచి సుమారు రూ.15 లక్షల కోట్ల విలువైన చమురు, రూ.1.91 లక్షల కోట్ల విలువైన బొగ్గు రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్నట్టు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ అంచనా వేసింది. చైనాకు 293.7 బిలియన్ యూరోల విలువైన చమురు, గ్యాస్, బొగ్గును రష్యా అమ్మింది. 2022 నుంచి ప్రపంచ శిలాజ ఇంధన అమ్మకాలతో రష్యా రూ.85-95 లక్షల కోట్లు సంపాదించినట్లు పేర్కొంది.


