News June 14, 2024
ఐపీఓ ఫైలింగ్‌కు హ్యుందాయ్ రెడీ
ఐపీఓను అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్న హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ నేడు సెబీకి డ్రాఫ్ట్ సమర్పించనుంది. ఈ ఐపీఓతో $3 బిలియన్లు సమకూర్చుకోవాలని, సంస్థ విలువను $20 బిలియన్లకు పెంచాలని ప్లాన్ చేస్తోంది. 140 నుంచి 150 మిలియన్ షేర్లు విక్రయించనున్నట్లు తెలుస్తోంది. హ్యుందాయ్ ప్లాన్స్ సక్సెస్ అయితే ఇది దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది.
Similar News
News September 14, 2024
ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి నేటికి 17 ఏళ్లు పూర్తి
మహేంద్ర సింగ్ ధోనీ టీమ్ ఇండియా పగ్గాలు చేపట్టి నేటికి సరిగ్గా 17 ఏళ్లు పూర్తయ్యాయి. 2007 సెప్టెంబర్ 14న ఆయన సారథ్య బాధ్యతలు చేపట్టారు. ధోనీ కెప్టెన్సీ చేపట్టిన వెంటనే 2007 టీ20 WC సాధించారు. ఆ తర్వాత సీబీ సిరీస్ 2008, ఐపీఎల్ 2010, సీఎల్ టీ20 2010, ఆసియా కప్ 2010, odi WC 2011, ఐపీఎల్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013, సీఎల్ టీ20 2014, ఆసియా కప్ 2016, ఐపీఎల్ 2018, 21, 23లో టైటిళ్లు సాధించారు.
News September 14, 2024
వంట నూనె ధరలు పెరగనున్నాయా?
కేంద్ర ప్రభుత్వం వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని 20% పెంచింది. దీంతో సన్‌ఫ్లవర్, సోయా బీన్, రిఫైన్డ్ పామాయిల్‌పై ఇంపోర్ట్ టాక్స్ 12.5% నుంచి 32.5%కి చేరింది. దేశంలో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న నేపథ్యంలో రైతులను ఆదుకునే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా ఇంపోర్ట్ టాక్స్ పెంపుతో వంట నూనెల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
News September 14, 2024
నిమ్స్‌లో పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్లు
TG: హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చిన్నారులకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు చేయనున్నట్లు సంచాలకుడు నగరి బీరప్ప తెలిపారు. ఈ నెల 22 నుంచి 28 వరకు యూకే డాక్టర్ల బృందం వీటిని నిర్వహించనుందని వెల్లడించారు. గుండెకు రంధ్రం, ఇతర సమస్యలతో బాధపడుతున్నవారు ఈ వైద్య సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు నిమ్స్‌లోని కార్డియో థొరాసిక్ వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు.