News August 28, 2024

హరీశ్‌రావు దొంగ అని నాకు ముందే తెలుసు: CM రేవంత్

image

TG: మాజీ మంత్రి, BRS MLA హరీశ్‌రావు‌పై CM రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. రుణమాఫీ విషయంలో హరీశ్ సవాల్ చేసి, రాజీనామా చేయకుండా పారిపోయారన్నారు. ఆయన దొంగ అని తనకు ముందే తెలుసన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం రూ.17,933 కోట్ల రుణమాఫీ చేసిందని సీఎం చెప్పారు. త్వరలోనే అందరికీ రుణమాఫీ అవుతుందన్నారు. హరీశ్, KTR ప్రతి రైతు దగ్గరికి వెళ్లాలని, రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించి కలెక్టరేట్‌లో ఇవ్వాలని సూచించారు.

Similar News

News January 22, 2026

నైనీ కోల్ బ్లాక్ టెండర్ నోటిఫికేషన్ రద్దు: సింగరేణి

image

TG: నైనీ కోల్ బ్లాక్ టెండర్‌పై వివాదం రేగడంతో దానిని రద్దు చేస్తున్నట్లు ఇటీవల Dy CM భట్టి విక్రమార్క ప్రకటించడం తెలిసిందే. తాజాగా ఆ టెండర్ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రకటించింది. అటు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనపై SCCLను ప్రశ్నించింది. దీంతో టెండర్లపై మరోసారి బోర్డులో చర్చించి నిర్ణయిస్తామని చెప్పిన సంస్థ తదుపరి చర్యలు చేపట్టింది.

News January 22, 2026

మిస్టర్ బీన్‌తో డేటింగ్‌లో లేను: మియా ఖలీఫా

image

మిస్టర్ బీన్ నటుడు రోవాన్ ఆట్కిన్సన్‌తో మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా డేటింగ్‌లో ఉన్నారని, వీరు వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్నారంటూ ఓ వార్త SMలో వైరలైంది. దీనిపై అంతర్జాతీయ మీడియా సైతం కోడై కూయడంతో మియా స్పందించారు. ‘నేను ఒక మూర్ఖుడితో డేటింగ్ చేస్తున్నాను. కానీ అది మిస్టర్ బీన్ కాదు’ అని ఆమె X వేదికగా క్లారిటీ ఇచ్చారు. 71ఏళ్ల రోవాన్ ఆట్కిన్సన్‌ ప్రస్తుతం లూయిస్ ఫోర్డ్‌తో డేటింగ్‌లో ఉన్నారు.

News January 22, 2026

PV సింధు అరుదైన ఘనత

image

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రికార్డు సృష్టించారు. ఇండోనేషియా మాస్టర్స్ 2026 టోర్నమెంట్‌లో డెన్మార్క్ ప్లేయర్ హోజ్మార్క్‌పై గెలిచి ఇంటర్నేషనల్ కెరీర్‌లో 500 విజయాలు సొంతం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన ఆరో మహిళా సింగిల్ ప్లేయర్‌గా ఘనత సాధించారు. సింధు విన్నింగ్ పర్సంటేజీ 68.22%గా ఉంది.