News August 28, 2024

హరీశ్‌రావు దొంగ అని నాకు ముందే తెలుసు: CM రేవంత్

image

TG: మాజీ మంత్రి, BRS MLA హరీశ్‌రావు‌పై CM రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. రుణమాఫీ విషయంలో హరీశ్ సవాల్ చేసి, రాజీనామా చేయకుండా పారిపోయారన్నారు. ఆయన దొంగ అని తనకు ముందే తెలుసన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం రూ.17,933 కోట్ల రుణమాఫీ చేసిందని సీఎం చెప్పారు. త్వరలోనే అందరికీ రుణమాఫీ అవుతుందన్నారు. హరీశ్, KTR ప్రతి రైతు దగ్గరికి వెళ్లాలని, రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించి కలెక్టరేట్‌లో ఇవ్వాలని సూచించారు.

Similar News

News September 10, 2024

ప్రమాదాలను నివారించిన రైల్వే సిబ్బందికి సన్మానం

image

TG: భారీ వర్షాల సమయంలో రైల్వే ట్రాక్‌లు ధ్వంసమైన ప్రదేశాలను గుర్తించి పైఅధికారులకు చెప్పి, ప్రమాదాలను నివారించిన వారిని రైల్వేశాఖ సన్మానించింది. సౌత్ సెంట్రల్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఆరుగురు సిబ్బందికి మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. G.మోహన్(ఇంటికన్నె), B.జగదీశ్(తాళ్లపూసపల్లి), K.కృష్ణ, B.జైల్‌సింగ్, V.సైదానాయక్, P.రాజమౌళి(మహబూబాబాద్) ఉన్నారు.

News September 10, 2024

రూ.500 లాటరీతో రూ.2.5 కోట్లు గెలిచాడు!

image

పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ప్రీతమ్ లాల్ పాత సామాన్లు కొనుగోలు చేస్తుంటారు. అలా వచ్చిన డబ్బులతో గత 50 ఏళ్లుగా లాటరీ టికెట్స్ కొంటున్న ఆయనకు ప్రతిసారి నిరాశే ఎదురయ్యేది. ఇక లాటరీలు కొనవద్దు అనుకోగా.. భార్య చెప్పడంతో ఇదే చివరిదని రూ.500 పెట్టి కొనుగోలు చేశారు. ఇన్నిరోజులు అతని సహనాన్ని పరీక్షించిన అదృష్టం ఆ లాటరీతో ప్రీతమ్ ఇంటి తలుపు తట్టింది. పంజాబ్ స్టేట్ లాటరీలో ఆయన రూ.2.5 కోట్లు గెలుపొందారు.

News September 10, 2024

ఎన్నికలు న్యాయంగా జరగలేదు: USలో రాహుల్

image

లోక్‌సభ ఎన్నికలు న్యాయంగా జరిగినట్టు తాను విశ్వసించడం లేదని LoP రాహుల్ గాంధీ అమెరికాలో అన్నారు. ‘BJPకి 240 సీట్లలోపు వచ్చుంటే నేను ఆశ్చర్యపోయేవాడిని. వారికి అర్థబలం చాలా ఎక్కువ. వారు కోరుకున్నట్టే EC పనిచేసింది. తన అజెండాకు తగిన విధంగా ఆయా రాష్ట్రాల్లో ప్రచారం చేసేందుకు మోదీకి అవకాశం దొరికింది. బ్యాంకు ఖాతాలు స్తంభించినా కాంగ్రెస్ పోటీ చేసింది. మోదీ ఆలోచనను నాశనం చేసింది’ అని ఆయన అన్నారు.