News March 21, 2024
రోహిత్, హార్దిక్ రాణిస్తారనే నమ్మకముంది: హర్భజన్

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించారు. ‘కెప్టెన్సీ మార్పు తర్వాత ఏ జట్టయినా కుదురుకోవడం తేలిక కాదు. రోహిత్, హార్దిక్ పాండ్యలలో ఎవరు ఇబ్బంది లేకుండా ఆడతారు? ఎవరు అసౌకర్యంగా భావిస్తారు? అనేది కాలమే చెబుతుంది. వీరిద్దరూ వివాదాలను పక్కనపెట్టి జట్టు భవిష్యత్ కోసం రాణిస్తారనే నమ్మకం నాకుంది’ అని అభిప్రాయపడ్డారు.
Similar News
News January 23, 2026
మెస్సీ మ్యాచ్కు CSR నిధులు… ఇరకాటంలో సింగరేణి

TG: నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లు సహా సింగరేణి కార్యకలాపాలపై కేంద్ర బృందం లోతుగా పరిశీలిస్తోంది. కోల్ మైన్ టెండర్ల నిబంధనల వివాదం, అక్రమాలపై ఆరా తీస్తోంది. CSR నిధులపైనా దృష్టి పెట్టింది. ఇటీవల ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో ప్రైవేటు సంస్థ నిర్వహించిన ఈవెంట్కు CSR నిధులు వినియోగించారు. ఈవెంట్ కోసం ₹10cr నిధులు వాడినట్లు ప్రకటించడం తెలిసిందే. 3 రోజుల్లో ఈ బృందం కేంద్రానికి నివేదిక అందించనుంది.
News January 23, 2026
మారని BCB నిర్ణయం.. T20 WCలో స్కాట్లాండ్!

T20 WC నుంచి BAN నిష్క్రమణ దాదాపు ఖరారు కావడంతో స్కాట్లాండ్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిక్సర్స్లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను చేర్చేందుకు ICC సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. T20 WCలో ఆడాలనే ఉన్నా తమ ప్లేయర్ల భద్రత దృష్ట్యా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. FEB 7న WIతో కోల్కతాలో జరిగే మ్యాచ్లో బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ ఆడే అవకాశాలు ఉన్నాయి.
News January 23, 2026
పంట మార్పిడి వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

రైతులు ఏళ్లుగా అనుసరిస్తున్న ఏకపంట సాగును మానుకొని పంట మార్పిడిపై దృష్టిపెట్టాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల భూ భౌతిక, రసాయన మార్పులను నియంత్రించడమే కాకుండా, భూసారం, భూమిలో పోషకాల లభ్యత పెరుగుతుంది. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందుతాయి. చీడపీడల ఉద్ధృతితో పాటు రసాయనాల వినియోగం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. పెట్టుబడి ఖర్చు తగ్గి పంట దిగుబడి పెరుగుతుంది.


