News March 21, 2024

రోహిత్, హార్దిక్ రాణిస్తారనే నమ్మకముంది: హర్భజన్

image

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ మార్పుపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించారు. ‘కెప్టెన్సీ మార్పు తర్వాత ఏ జట్టయినా కుదురుకోవడం తేలిక కాదు. రోహిత్, హార్దిక్ పాండ్యలలో ఎవరు ఇబ్బంది లేకుండా ఆడతారు? ఎవరు అసౌకర్యంగా భావిస్తారు? అనేది కాలమే చెబుతుంది. వీరిద్దరూ వివాదాలను పక్కనపెట్టి జట్టు భవిష్యత్ కోసం రాణిస్తారనే నమ్మకం నాకుంది’ అని అభిప్రాయపడ్డారు.

Similar News

News September 12, 2024

వినాయక చవితి వేడుకల్లో హిట్‌మ్యాన్

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వినాయక చవితి వేడుకల్లో సందడి చేశారు. తన ఇంట్లోనే గణపతి విగ్రహం ప్రతిష్ఠించి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ కోసం హిట్‌మ్యాన్ సిద్ధమవుతున్నారు. ఎక్కువసేపు జిమ్, మైదానంలోనే ఆయన గడుపుతున్నారు.

News September 12, 2024

బంగ్లాతో తొలి టెస్టుకు భారత్ తుది జట్టు ఇదే?

image

ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం తుది జట్టు ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టీమ్ ఇండియా తుది జట్టు ఇలా ఉంటుందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. జట్టు: రోహిత్ శర్మ (C), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్.

News September 12, 2024

సెప్టెంబర్ 12: చరిత్రలో ఈ రోజు

image

1686: మొఘల్ సామ్రాజ్యంలో బీజాపూరు రాజ్యం విలీనం
1925: ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ జోలెపాళ్యం మంగమ్మ జననం
1967: నటి అమల అక్కినేని జననం
1997: నటి శాన్వీ మేఘన జననం
2009: హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ మరణం
2009: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రాజ్‌సింగ్ దుంగార్పూర్ మరణం
2010: సింగర్ స్వర్ణలత మరణం