News March 4, 2025
సిరాజ్‌తో డేటింగ్ చేయట్లేదు: మహీరా శర్మ

IND క్రికెటర్ సిరాజ్‌తో <<15305689>>డేటింగ్ వార్తలను<<>> బాలీవుడ్ నటి మహీరా శర్మ ఖండించారు. తాను ఎవరితోనూ రిలేషన్‌లో లేనని స్పష్టం చేశారు. ఫ్యాన్స్ ఎవరితోనైనా సంబంధం కలిపేస్తారని, వాటిని ఆపలేమని పేర్కొన్నారు. ‘కో స్టార్లతో రిలేషన్ ఉందంటారు. ఎడిటెడ్ ఫొటోలను SMలో పోస్టు చేస్తారు. వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. ఇటీవల ఆమె తల్లి సానియా శర్మ కూడా డేటింగ్ వార్తలను కొట్టిపారేశారు.
Similar News
News March 4, 2025
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు Shocking News

AIతో సగం ఉద్యోగులతోనే డబుల్ రెవెన్యూ సాధించాలని టీమ్స్‌ను సవాల్ చేస్తున్నామని HCL టెక్ CEO<<15647926>> విజయ్<<>> కుమార్ చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. Infy CEO సలిల్ పారేఖ్ ఆయనతో ఏకీభవించడం మరింత భయపెడుతోంది. కంపెనీలన్నీ AI దారి అనుసరిస్తే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో సగం మందికి జాబ్స్ పోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే వెస్ట్ నుంచి ప్రాజెక్టులు తగ్గి రెవెన్యూ మందగించిన వేళ మరెన్ని దుర్వార్తలు వినాల్సి వస్తోందో!
News March 4, 2025
ఆదోనికి పోసాని కృష్ణమురళి

AP: గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళిని ఆదోని PSకు తరలిస్తున్నారు. అక్కడ ఆయనపై కేసు నమోదైన నేపథ్యంలో పీటీ వారెంట్ దాఖలు చేసి తీసుకెళ్తున్నారు. మరోవైపు, నరసరావుపేట కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ వేయగా దానిపై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. రాజంపేట జైలులో ఉన్న ఆయన్ను నిన్న పోలీసులు పీటీ వారంట్‌పై నరసరావుపేట తీసుకురాగా, జడ్జి 10 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
News March 4, 2025
మైక్రోచిప్, ఓలా, స్టార్‌బక్స్‌లో వేలాది ఉద్యోగాల కోత

మైక్రోచిప్, ఓలా, స్టార్‌బక్స్ సంస్థలు భారీగా ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించాయి. మైక్రోచిప్ 2వేలు, ఓలా ఎలక్ట్రిక్ 1000, స్టార్‌బక్స్ 1100, హెచ్‌పీ 2వేల ఉద్యోగాల్ని తొలగించనున్నాయి. ఖర్చు తగ్గింపులో భాగంగా కొలువుల్ని తగ్గిస్తున్నట్లు సంస్థలు వివరిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లోపు లే ఆఫ్స్ పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ఉద్యోగుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.