News May 18, 2024
నేను పార్టీ మారడం లేదు: విజయశాంతి
TG: తాను పార్టీ మారడం లేదని సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. దేశంలోని ప్రాంతీయ పార్టీల స్వభావం గురించి మాట్లాడితే కొందరు పార్టీ మార్పు ఊహించుకుంటున్నారని మండిపడ్డారు. కాగా కొంతకాలంగా కాంగ్రెస్‌పై రాములమ్మ అసంతృప్తితో ఉన్నారని.. బీఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగింది.
Similar News
News December 11, 2024
కేజీ గార్బేజ్ తీసుకొస్తే చాలు.. కడుపు నిండా ఫుడ్
ఆకలిగా ఉన్నా డబ్బులు లేవని బాధపడుతున్న వారికి అంబికాపూర్‌లోని(ఛత్తీస్‌గఢ్) ‘గార్బేజ్ కేఫ్’ కడుపు నిండా ఆహారం పెడుతోంది. ఈ ప్రత్యేకమైన కేఫ్‌లో 1 కేజీ ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొచ్చిన వారికి భోజనాన్ని అందిస్తున్నారు. ఇందులో రోటీలతో పాటు అన్నం, సలాడ్, ఊరగాయలు, పాపడ్ ఉంటాయి. ప్లాస్టిక్ సీసాలు, ఇతర వ్యర్థాలను తీసుకురావాలి. అన్నార్థుల ఆకలి తీర్చడం, కాలుష్యాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
News December 11, 2024
పేర్ని నాని భార్య జయసుధపై కేసు
AP: రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు నమోదైంది. సివిల్ సప్లైస్ అధికారి కోటి రెడ్డి ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో జయసుధ పేరిట నాని ఓ గిడ్డంగి నిర్మించారు. దీనిని పౌరసరఫరాలశాఖకు అద్దెకు ఇచ్చారు. ఇటీవల ఈ గోడౌన్‌ను పోలీసులు తనిఖీలు చేయగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.
News December 11, 2024
రాష్ట్రంలో మళ్లీ రేషన్ మాఫియా: జగన్
AP: రాష్ట్రంలో రేషన్ మాఫియా మళ్లీ వచ్చిందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన మండిపడ్డారు. ‘ప్రజలకు నాణ్యమైన స్వర్ణరకం బియ్యం ఇవ్వడం లేదు. సార్టెక్స్ బియ్యం అందుబాటులో లేదు. ప్రజలకు నాసిరకం బియ్యం ఇస్తున్నారు. ఆర్థిక మంత్రి వియ్యంకుడే బియ్యం అక్రమ ఎగుమతులు చేస్తున్నారు. కానీ నిందలు మాపై వేస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.