News March 31, 2024
రాష్ట్ర ప్రజల కోసమే తగ్గాను: పవన్ కళ్యాణ్

AP: వైసీపీ కుట్రలు, కుతంత్రాలను సమర్థంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు జనసేనాని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. పిఠాపురంలో కార్యకర్తలతో సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల కోసమే తాను తగ్గానని తెలిపారు. జనసేన-టీడీపీ కలిసి ముందుకు వెళ్తేనే రాష్ట్రాన్ని కాపాడుకోగలమని అన్నారు. నాయకుల మధ్య ఇబ్బందులు ఉంటే సర్దుకుపోవాలని.. పిఠాపురంలో తన గెలుపు చరిత్రలో నిలిచిపోవాలన్నారు.
Similar News
News January 21, 2026
పండ్ల తోటల్లో కలుపు నివారణ మార్గాలు

పండ్ల తోటల తొలిదశలో అంతర పంటలతో కలుపు తగ్గించవచ్చు. పండ్ల కోత తర్వాత ముందుగా తోటంతా అడ్డంగా, నిలువుగా దున్నాలి. కలుపు మొక్కలు పెరిగితే రోటావేటర్ తోటలోకి వెళ్లడానికి వీలుగా ఏపుగా పెరిగిన కొమ్మలను తీసేసి ఒకసారి తోటంతా శుభ్రం చేస్తే నెలరోజులపాటు కలుపును నివారించవచ్చు. తోటను శుభ్రం చేసిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు 1-1.5 లీటర్ల పెండిమిథాలిన్‌ను 5 కిలోల ఇసుకలో కలిపి తోటంతా సమానంగా వెదజల్లాలి.
News January 21, 2026
APPLY NOW: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో ఉద్యోగాలు

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు(<
News January 21, 2026
మొబైల్ లేకున్నా వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ అందుబాటులోకి తేనుంది. దీంతో మొబైల్ లేకపోయినా వాయిస్, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. గ్రూప్ కాల్‌లో 32 మంది మాత్రమే కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కంప్యూటర్/ల్యాప్‌టాప్‌లో ఏ అప్లికేషన్లు ఇన్‌స్టాల్ చేసుకోకుండానే కాల్స్‌లో కనెక్ట్ కావచ్చు. వాట్సాప్ వెబ్ యూజర్లకు 2 వారాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.


