News January 11, 2025

అరనిమిషంలో 10కోట్ల రైతుల ఖాతాల్లో డబ్బులు వేయగలను: మోదీ

image

టెక్నాలజీలో దేశం అనేక మైలురాళ్లను అధిగమించిందని నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో PM మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా విజయాలను గుర్తుచేశారు. ‘నేనిప్పుడు 30 సెకన్లలో 10కోట్ల రైతుల A/Cకు డబ్బులు బదిలీ చేయగలను. 13 కోట్ల మందికి సిలిండర్ సబ్సిడీ వేయగలను. టెక్నాలజీని డెమోక్రటైజ్ చేయడమెలాగో ప్రపంచానికి భారత్ బోధించింది. కేవలం మొబైల్ ఉంటే చాలు. టెక్నాలజీ ఇన్నోవేషన్ కోసం మేం కమిషన్, ఫండ్ ఏర్పాటు చేశాం’ అని అన్నారు.

Similar News

News January 24, 2025

వీటిని రాత్రి నానబెట్టి తింటే..

image

అంజీర్ పండ్లను రాత్రి నానబెట్టి ఉదయం తింటే అనేక లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. తేనెతో కలిపి పరగడుపున తింటే జీర్ణశక్తి మెరుగవుతుంది. ఇందులోని కాల్షియం ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. మహిళల్లో వచ్చే హార్మోన్ సమస్యలను తగ్గిస్తాయి. రక్త సరఫరా పెరుగుతుంది. గుండెపోటు రాకుండా ఉండేందుకు ఇందులోని పోషకాలు సహాయపడతాయి.

News January 24, 2025

చిరంజీవితో అనిల్ రావిపూడి మరో బ్లాక్‌బస్టర్ తీస్తారు: నిర్మాత

image

విజయ పరంపర కొనసాగిస్తున్న అనిల్ రావిపూడి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. ‘లైలా’ చిత్రం ఈవెంట్‌లో దీనిపై నిర్మాత సాహు గారపాటి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘చిరంజీవితో అనిల్ తీయబోయే సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం. ఇది ఎమోషన్స్‌తో కూడిన కథ. ఈ మూవీ విజయంతో అనిల్ రావిపూడి కెరీర్‌లో ట్రిపుల్ హ్యాట్రిక్ ఖాయం’ అని తెలిపారు.

News January 24, 2025

USలోకి అక్రమంగా ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు: ట్రంప్

image

US నుంచి అక్రమ వలసదారులను పంపించేస్తున్నారు. మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్‌లో వారిని ఎక్కిస్తున్న ఫొటోలను వైట్ హౌస్ విడుదల చేసింది. ‘అక్రమ వలసదారులను తరలించే ఫ్లైట్స్ మొదలయ్యాయి. చట్టవిరుద్ధంగా USలోకి ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇదే ప్రపంచానికి ప్రెసిడెంట్ ఇచ్చే స్పష్టమైన మెసేజ్’ అని పేర్కొంది. అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.