News March 13, 2025

స్పీకర్‌ను కించపరచలేదు.. ప్రభుత్వాన్ని నిలదీశా: జగదీశ్ రెడ్డి

image

TG: అసెంబ్లీలో తాను స్పీకర్‌ను కించపరచలేదని, ప్రభుత్వాన్ని నిలదీశానని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. తనపై సస్పెన్షన్‌ వేటు వేయడంతో కేటీఆర్, హరీశ్‌రావుతో కలిసి ఆయన అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. సభలో అందరికీ సమాన హక్కులుంటాయని మాత్రమే తాను చెప్పినట్లు పేర్కొన్నారు. స్పష్టమైన కారణం లేకుండా సభ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఇంకా బలంగా గొంతు వినిపిస్తానని జగదీశ్ స్పష్టం చేశారు.

Similar News

News March 21, 2025

APPSC పరీక్షల తేదీలు ప్రకటన

image

AP: పలు ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ, టీటీడీ డిగ్రీ కాలేజీల్లో 464 లెక్చరర్ పోస్టులకు జూన్ 16 నుంచి 26 వరకు <>ఎగ్జామ్స్ నిర్వహిస్తామంది.<<>> కాగా పాలిటెక్నిక్ కాలేజీల్లో 91, జూనియర్ కాలేజీల్లో 47, డిగ్రీ కాలేజీల్లో 240, టీటీడీ డిగ్రీ కాలేజీల్లో 78 పోస్టులకు గత ఏడాది నోటిఫికేషన్ విడుదల చేసింది.

News March 21, 2025

BREAKING: పరీక్ష వాయిదా

image

AP: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కీలక ప్రకటన చేసింది. డాక్టర్ అంబేడ్కర్ గురుకులాల్లో 2025-26కు గాను ఐదో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌‌లో ప్రవేశాలకు ఏప్రిల్ 6న జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు వెల్లడించింది. దీన్ని అదే నెల 13న నిర్వహిస్తామని తెలిపింది.

News March 21, 2025

‘టాక్సిక్’ కోసం రూ.15 కోట్లు తీసుకుంటున్న కియారా!

image

రాకింగ్ స్టార్ యశ్, కియారా కాంబోలో తెరకెక్కుతోన్న ‘టాక్సిక్’ షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమా కోసం కియారా ఏకంగా రూ.15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆమె భారీ పారితోషికం తీసుకుంటున్న నటీమణులలో ఒకరిగా మారనున్నట్లు వెల్లడించాయి. కాగా, SSMB29 కోసం ప్రియాంకా చోప్రా రూ.30 కోట్లు తీసుకుంటున్నారని టాక్.

error: Content is protected !!