News June 13, 2024

జబ్బు ఏంటో నాకు తెలియలేదు.. పనిమనిషి కనిపెట్టేసింది: డాక్టర్

image

తన 17ఏళ్ల అనుభవం కనిపెట్టలేని వ్యాధిని పనిమనిషి 10 సెకన్లలో గుర్తించిందని కేరళ వైద్యుడు డా.ఫిలిప్స్ తనకు ఎదురైన వింత అనుభవాన్ని పంచుకున్నారు. ‘వైరల్ హెపటైటిస్ నుంచి డెంగీ వరకు అన్ని టెస్టులు చేసినా ఫలితం లేకపోయింది. ఇంతలో మా పనిమనిషి వచ్చి అది ‘అంజామ్‌పనీ’ (5th డిసీజ్) అని, తన మనుమళ్లలో ఆ లక్షణాలు చూశానని చెప్పింది. వెంటనే పార్వోవైరస్ B19 టెస్ట్ చేస్తే పాజిటివ్ అని తేలింది’ అని Xలో పోస్ట్ చేశారు.

Similar News

News September 12, 2024

సీతారాం ఏచూరితో సంభాషణలు మిస్సవుతా: రాహుల్ గాంధీ

image

అనారోగ్యంతో కన్నుమూసిన కమ్యూనిస్టు దిగ్గజం సీతారాం ఏచూరికి రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబం, స్నేహితులు, అనుచరులకు సానుభూతి వ్యక్తం చేశారు. ‘సీతారాం ఏచూరి ఓ స్నేహితుడు. భారత్ అన్న ఆలోచనకు రక్షకుడు. దేశంపై ఆయనకు మంచి అవగాహన ఉంది. తరచూ మా మధ్య జరిగే సంభాషణలను ఇకపై నేను మిస్సవుతాను’ అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలూ ఏచూరి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

News September 12, 2024

కోలుకుంటున్న రవితేజ.. LATEST PHOTO

image

హీరో రవితేజకు ఇటీవల షూటింగ్‌లో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అభిమానులు ఆందోళనకు లోనవుతుండటంతో చిన్నగాయమేనని రవితేజ అప్‌డేట్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ప్రమాదం తర్వాత తొలిసారిగా రవి ఫొటో బయటికొచ్చింది. డైరెక్టర్ బాబీతో భేటీ అనంతరం తీసిన ఆ ఫొటోలో ఆయన చేతికి కట్టుతో కనిపిస్తున్నారు. దీంతో రవితేజ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్స్‌లో పాల్గొనాలంటూ ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు.

News September 12, 2024

BRS హయాంలో పీఏసీ పదవి MIMకి ఎందుకిచ్చారు? : రేవంత్

image

TG: BRS నేతలు సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారని CM రేవంత్ మండిపడ్డారు. ఎవరి కోసం ప్రత్యేక రాజ్యాంగం ఉండదన్నారు. ‘BRS హయాంలో పీఏసీ పదవి MIMకి ఎందుకిచ్చారు? ఎవరూ పార్టీ మారకపోతే మాకే మేలు. అసెంబ్లీలో మా బలం 65. BJP, BRS మా ప్రభుత్వాన్ని 3నెలల్లో కూల్చేస్తాం అంటున్నాయి. ఫిరాయింపు చట్టం కఠినంగా ఉంటే ఆ పరిస్థితి రాదు. హైకోర్టు తీర్పుని అధ్యయనం చేయలేదు. దానిపై ఇప్పుడే స్పందించలేను’ అని అన్నారు.