News November 15, 2024
రణ్వీర్ను నేను వెయిట్ చేయించలేదు: ముకేశ్ ఖన్నా
తన ఆఫీస్కి వచ్చిన రణ్వీర్ సింగ్ను 3 గంటలపాటు వెయిట్ చేయించారన్న వార్తల్ని ‘శక్తిమాన్’ ముకేశ్ ఖన్నా ఖండించారు. ‘ఆయన ఉండాలనుకున్నారు కాబట్టి ఉన్నారు. తనో అద్భుతమైన నటుడు. కానీ శక్తిమాన్ పాత్రలో ఎవరు నటించాలో డిసైడ్ చేయాల్సింది నేను. నిర్మాతలు నటుల్ని ఎంపిక చేయాలి గానీ నటులు నిర్మాతల్ని ఎంపిక చేయరాదు. నా ఆఫీస్కి వచ్చి శక్తిమాన్ పాత్ర చేస్తానంటే..? ఒప్పేసుకోవాలా? కుదరదు’ అని తేల్చిచెప్పారు.
Similar News
News December 11, 2024
హోంమంత్రి అనితపై కేసు కొట్టివేత
AP: హోంమంత్రి అనితకు చౌక్ బౌన్స్ కేసులో ఊరట దక్కింది. తన వద్ద తీసుకున్న రూ.70లక్షలకు గానూ అనిత ఇచ్చిన చెక్కు చెల్లలేదని 2019లో వేగి శ్రీనివాసరావు అనే వ్యక్తి విశాఖ కోర్టును ఆశ్రయించారు. కేసును రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని వీరిద్దరూ నిర్ణయానికి రాగా, విశాఖ కోర్టులో ప్రొసీడింగ్స్ కొట్టేయాలని అనిత హైకోర్టులో పిటిషన్ వేశారు. మంగళవారం విచారణ జరగ్గా ఆమెపై ఉన్న కేసును కోర్టు కొట్టేసింది.
News December 11, 2024
గజగజ.. మళ్లీ పెరిగిన చలి
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. గతనెల నుంచే చలి తీవ్రత విపరీతంగా మొదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. TGలోనూ మోస్తరు వానలు, ఆకాశం మబ్బు పట్టడం వల్ల చలి బాగా తగ్గిపోయింది. కానీ గత 2 రోజులుగా చలి మళ్లీ పెరిగింది. రానున్న రోజుల్లో మరింత తీవ్రం కానుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
News December 11, 2024
స్కూళ్లకు మూడు రోజులు సెలవులు
క్రిస్మస్ సందర్భంగా స్కూళ్లకు మూడు రోజులు సెలవులు ఇస్తూ TG ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 24న క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే నేపథ్యంలో సెలవులుగా పేర్కొంది. గతంలో క్రిస్మస్కు 5 రోజులు సెలవులు ఇవ్వగా ఈసారి ప్రభుత్వం 3 రోజులకు కుదించింది. మరోవైపు ఏపీలో 24, 26న ఆప్షనల్ హాలిడే, 25న జనరల్ హాలిడే ఉండనుంది.