News July 13, 2024
నేను ఆ పోస్టే చేయలేదు: ధ్రువ్ రాఠీ

తనపై <<13622151>>కేసు<<>> నమోదైందని వస్తోన్న వార్తలను యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఖండించారు. కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎలాంటి పోస్ట్ చేయలేదని, గుర్తు తెలియని వ్యక్తులు తన పేరడి అకౌంట్లో పోస్ట్ చేశారని తెలిపారు. కావాలంటే ఓసారి చెక్ చేయాలని సూచించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు UPSC పరీక్షకు హాజరుకాకుండానే ఉత్తీర్ణత సాధించినట్లు ‘ధ్రువ్ పేరడీ’ X అకౌంట్లో పోస్ట్ చేశారు.
Similar News
News December 4, 2025
వైసీపీ వల్లే రాజధాని నిర్మాణం ఆలస్యం: నారాయణ

AP: వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో రాజధాని అమరావతి నిర్మాణం ఆలస్యమైందని మంత్రి నారాయణ విమర్శించారు. బకాయిలు చెల్లించి పనులు ప్రారంభించే నాటికి వర్షాలు ముంచెత్తాయని చెప్పారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయిలో రెండో విడత భూసమీకరణపై గ్రామస్థులతో సమావేశమయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తామని పేర్కొన్నారు.
News December 4, 2025
ENCOUNTER: 19కి చేరిన మృతుల సంఖ్య

ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన <<18460138>>ఎన్కౌంటర్లో<<>> మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు 19 మంది మావోలు చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో PLGA-2 కమాండర్ వెల్లా మోడియం కూడా ఉన్నారు. భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మరోవైపు ఎదురుకాల్పుల్లో నిన్న ముగ్గురు పోలీసులు మరణించిన విషయం తెలిసిందే.
News December 4, 2025
దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

AP: దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాల్లో వాగులు, నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అటు ప్రకాశం, ATP, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, CTR జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు రహదారులు, తోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.


