News July 13, 2024

నేను ఆ పోస్టే చేయలేదు: ధ్రువ్ రాఠీ

image

తనపై <<13622151>>కేసు<<>> నమోదైందని వస్తోన్న వార్తలను యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఖండించారు. కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎలాంటి పోస్ట్ చేయలేదని, గుర్తు తెలియని వ్యక్తులు తన పేరడి అకౌంట్‌లో పోస్ట్ చేశారని తెలిపారు. కావాలంటే ఓసారి చెక్ చేయాలని సూచించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు UPSC పరీక్షకు హాజరుకాకుండానే ఉత్తీర్ణత సాధించినట్లు ‘ధ్రువ్ పేరడీ’ X అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

Similar News

News February 18, 2025

అనాథాశ్రమంలో అగ్నిప్రమాదం

image

AP: కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో 140 మంది విద్యార్థులు ఆశ్రమంలో ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. స్థానికులు వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 18, 2025

బీజేపీ ఆదాయం రూ.4,340 కోట్లు

image

2023-24లో దేశంలోని ఆరు జాతీయ పార్టీలకు వివిధ మార్గాల ద్వారా రూ.5,820 కోట్ల ఆదాయం వచ్చినట్లు ADR వెల్లడించింది. ఇందులో 74.56%(₹4,340Cr) వాటా బీజేపీకే చేరిందని తెలిపింది. ఆ తర్వాత కాంగ్రెస్(₹1,225Cr), సీపీఎం(₹167 కోట్లు), బీఎస్పీ(₹64Cr), ఆప్(₹22Cr), నేషనల్ పీపుల్స్ పార్టీ(₹22L) ఉన్నాయంది. 2022-23తో పోలిస్తే బీజేపీ ఆదాయం 83.85%, కాంగ్రెస్ ఆదాయం 170.82% పెరిగినట్లు పేర్కొంది.

News February 18, 2025

SSMB29 రెండో షెడ్యూల్ షురూ

image

రాజమౌళి డైరెక్షన్‌లో మహేశ్ బాబు నటిస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్ చిత్రం SSMB29 షూటింగ్ రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. హైదరాబాద్‌‌ శివారులో నిర్మించిన ఓ ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. సోదరుడి వివాహం కోసం బ్రేక్ తీసుకున్న ప్రియాంకా చోప్రా మళ్లీ సెట్‌లో అడుగుపెట్టారు. మరోవైపు ఈ వేసవిలో విదేశాల్లో షూటింగ్‌కు మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

error: Content is protected !!