News April 8, 2024
అలాంటివి నేను పట్టించుకోను: రష్మిక
‘యానిమల్’లో తన నటనకు వస్తున్న ట్రోల్స్‌పై హీరోయిన్ రష్మిక స్పందించారు. ‘కర్వాచౌత్ సీన్‌లో నేను సరిగా నటించలేదని కొందరు విమర్శిస్తున్నారు. కానీ అవన్నీ నేను పట్టించుకోను. ఆ సీన్ కోసం నేనెంత కష్టపడ్డానో నాకే తెలుసు. దానికి చాలా ప్రశంసలు వచ్చాయి. ఎలాంటి సీన్లలో ఎలా నటించాలో నాకు తెలుసు’ అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ‘పుష్ప2’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ షూటింగ్ పనుల్లో రష్మిక బిజీగా ఉన్నారు.
Similar News
News November 6, 2024
సిరీస్ ఆస్ట్రేలియాదే: పాంటింగ్
టీమ్ ఇండియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా విజేతగా నిలుస్తుందని రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. స్టీవ్ స్మిత్ లేదా రిషభ్ పంత్ ఎక్కువ రన్స్ చేస్తారని తెలిపారు. ఆసీస్ బౌలర్ హేజిల్‌వుడ్ అత్యధిక వికెట్లు తీస్తారని అంచనా వేశారు.
News November 6, 2024
మొన్న తిట్టారు.. ఇవాళ మెచ్చుకున్నారు: మంత్రి
AP: గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు విషయంలో తనను తిట్టిన CM చంద్రబాబు ఇవాళ మెచ్చుకున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ట్వీట్ చేశారు. ‘శెభాష్ సుభాష్ అంటూ సీఎం చంద్రబాబు మెచ్చుకోలు నాకు కొండంత బలం. మొన్న తిట్టిన ఆయన ఈరోజు భుజం మీద చెయ్యి వేసి బాగా చేశావయ్యా.. ఓటర్ రిజిస్ట్రేషన్ 90% దాటించావ్ అంటే వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. తిట్టినా మెచ్చుకున్నా మాకు అన్ని ఆయనే’ అని సీఎంతో దిగిన ఫొటోను షేర్ చేశారు.
News November 6, 2024
OTTల్లోకి కొత్త సినిమాలు
ఈ వారం ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి.
*నవంబర్ 7: సమంత, వరుణ్ ధవన్ నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ (అమెజాన్ ప్రైమ్)
*నవంబర్ 8: ఎన్టీఆర్ ‘దేవర’, రజనీకాంత్ ‘వేట్టయన్’, అనుపమ్ ఖేర్ ‘విజయ్ 69’ (నెట్‌ఫ్లిక్స్), సుహాస్ నటించిన ‘జనక అయితే గనక’ (ఆహా), బాలకృష్ణ, సూర్య ‘అన్‌స్టాపబుల్’ షో (ఆహా)