News March 11, 2025
ఎవరినీ బాధపెట్టాలని కాదు: రోహిత్ శర్మ

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్, ఫైనల్ మ్యాచుల్లో బౌలర్ కుల్దీప్ యాదవ్‌పై కెప్టెన్ రోహిత్, కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బౌలింగ్ వేశాక కుల్దీప్ స్టంప్స్ వెనక ఉండకపోవడం, త్రో విసిరిన బంతిని పట్టుకోకపోవడంతో వారు సీరియస్ అయ్యారు. ‘ఫీల్డ్‌లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు నియంత్రణ కోల్పోతాం. అంతా ఆటలో భాగం. గ్రౌండ్‌లో అనే మాటలు ఎవరినీ బాధ పెట్టడానికి కాదు’ అని రోహిత్ శర్మ దీనిపై వివరణ ఇచ్చారు.
Similar News
News March 11, 2026
వరల్డ్ కప్ గెలిచాక ట్రైన్‌లో ముంబైకి వెళ్లిన దూబే

ప్రపంచ కప్ గెలిచామన్న సంతోషం ఓ వైపు. ఈ మధుర క్షణాలను పిల్లలతో పంచుకోవాలనే ఆరాటం మరో వైపు. అదే సమయంలో విమాన టికెట్స్ దొరక్కపోవడంతో టీమ్ఇండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే తన భార్యతో కలిసి రైలులో థర్డ్ ఏసీ కోచ్‌లో అహ్మదాబాద్ నుంచి ముంబైకి ప్రయాణించారు. ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్, క్యాప్ ధరించి పై బెర్త్‌పై పడుకుని సొంతూరుకు చేరుకున్నారు.
News March 11, 2026
సంచలన తీర్పు.. కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి

సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిస్తూ 32 ఏళ్ల హరీశ్ రాణాకు కారుణ్య మరణం (Passive Euthanasia) కింద వైద్య సహాయాన్ని నిలిపివేసేందుకు అనుమతించింది. దేశంలో ఇటువంటి కేసు ఇదే మొదటిది కావడం గమనార్హం. 100% వైకల్యంతో రాణా 12 ఏళ్లుగా కోమాలో ఉన్నారు. ఆయనకు లైఫ్ సపోర్ట్ తొలగించాలని ధర్మాసనం సూచించింది. కోలుకునే అవకాశం లేనప్పుడు గౌరవప్రదంగా మరణించే హక్కు వ్యక్తికి ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది.
News March 11, 2026
సర్‌ప్రైజింగ్.. రోడ్డుపై గుంత వల్ల దక్కిన ప్రాణం!

UPకి చెందిన వినీత శుక్లా(50) మరణం అంచులకు చేరి తిరిగి ప్రాణాలతో బయటపడ్డారు. డాక్టర్లు ఆమెను ‘బ్రెయిన్ డెడ్’గా ప్రకటించడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్తున్నారు. NH-74పై ఉన్న ఓ పెద్ద గుంత వల్ల వాహనం తీవ్ర కుదుపునకు లోనైంది. దాంతో ఆమెలో మళ్లీ చలనం మొదలై శ్వాస తీసుకోవడం ప్రారంభించారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆమె కోలుకుని ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు.


