News March 29, 2024

హింసాత్మక చిత్రాలు చూడను.. నటిస్తా: ఆండ్రియా

image

కోలీవుడ్ హీరోయిన్ ఆండ్రియా జెర్మియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను హారర్, హింసాత్మక చిత్రాలు చూడనని, కానీ అలాంటి సినిమాల్లో నటిస్తానని చెప్పారు. చూడటం వేరు.. నటించడం వేరని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తమిళంలో కా- ది ఫారెస్ట్, పిశాచి-2, నో ఎంట్రీ తదితర మూవీల్లో నటిస్తున్నారు. ఇటీవలే తెలుగులో ‘సైంధవ్’లో కీలక పాత్ర పోషించారు. ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్‌గానూ రాణిస్తున్నారు.

Similar News

News April 3, 2026

YELLOW ALERT: 5 రోజులు వర్షాలు!

image

TG: రాష్ట్రంలో ఎండలు, అకాల వర్షాలతో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. పలు జిల్లాల్లో 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని IMD అధికారులు వెల్లడించారు. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వానలకు ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా 4 రోజుల వర్షాల అప్డేట్ కోసం పై ఫొటోను స్వైప్ చేయండి.

News April 3, 2026

అన్నామలైకి నో టికెట్.. మైలాపూర్ నుంచి తమిళి సై పోటీ

image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 27 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలైకి టికెట్ దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. పొత్తులో ఉన్న అన్నాడీఎంకేతో ఆయనకున్న విభేదాలే కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మైలాపూర్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై, సాత్తూర్ నుంచి బీజేపీ స్టేట్ చీఫ్ నాగేంద్రన్ బరిలో దిగుతున్నారు.<<-se>>#ELECTIONS2026<<>>

News April 3, 2026

ఫుడ్ రేట్లు పెంచారు సరే.. మళ్లీ తగ్గిస్తారా?

image

సరిపడా వంటగ్యాస్ సిలిండర్లు దొరకట్లేదని, బ్లాక్‌లో అధిక ధరకు కొంటున్నామని చాలా హోటళ్లు ఫుడ్ రేట్లను పెంచేశాయి. ఇందులో కొంత వాస్తవం ఉంది. అయితే గ్యాస్ సంక్షోభం తీరిపోతే పెంచిన ధరలను తగ్గిస్తారా? అని సామాన్యులకు సందేహం వస్తోంది. గతంలో కరోనా సమయంలో రేట్లను పెంచారు. ఆ మహమ్మారి వదిలి సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ అవే ధరలను కంటిన్యూ చేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తారో? COMMENT?