News August 13, 2025
‘కూలీ’ సినిమాను ఎంజాయ్ చేశా: ఉదయనిధి

రేపు విడుదల కానున్న రజినీకాంత్ ‘కూలీ’ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ రివ్యూ ఇచ్చారు. ‘ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రజినీకాంత్‌కు అభినందనలు. ఈ పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌లో ప్రతి సన్నివేశం ఎంజాయ్ చేశా. ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది’ అని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News August 14, 2025
జిల్లా టాపర్లకు రూ.10,000

TG: ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో టెన్త్, ఇంటర్ చదివి జిల్లా టాపర్లుగా నిలిచిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది. ప్రతి జిల్లాలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలకు రూ.10,000 చొప్పున ఇవ్వనుంది. స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని ఈ బహుమతులు ఇవ్వాలని, స్కూళ్లు, జిల్లా స్థాయిలో ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ సూచించింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించాలని ఆదేశించింది.
News August 14, 2025
కొత్త వాహనాలు కొంటున్నారా?

TG: రాష్ట్రంలో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్‌ను ప్రభుత్వం పెంచింది. ఎక్స్‌షోరూం ధరను బట్టి ద్విచక్ర వాహనాలకు 3, కార్లు, ఇతర వ్యక్తిగత వాహనాలకు 5 శ్లాబుల్లో పన్ను విధించనుంది. తక్కువ ధర వెహికిల్స్‌పై ఈ ప్రభావం ఉండదు. బైక్ ధర ₹లక్ష దాటితే 3%, ₹2 లక్షలు మించితే 6%, కార్ల ధర ₹10 లక్షలు దాటితే 1% ట్యాక్స్ పెరగనుంది. ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చే ఈ పన్నులతో కొనుగోలుదారులపై సుమారు రూ.3 వేల భారం పడనుంది.
News August 14, 2025
అది మన చరిత్రలో విషాదకర అధ్యాయం: మోదీ

1947లో భారత్, పాక్ విభజన సందర్భంగా జరిగిన విధ్వంసంపై PM మోదీ ట్వీట్ చేశారు. ‘మన చరిత్రలోనే విషాదకర అధ్యాయమైన విభజన సమయంలో అసంఖ్యాక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఊహకందని నష్టాన్ని ఎదుర్కొన్నారు. వారి ధైర్య సాహసాలను గౌరవించుకోవాల్సిన రోజు ఇది. దేశాన్ని ఐక్యంగా, సామరస్యంగా ఉంచడం మన బాధ్యత అని ఈ రోజు గుర్తు చేస్తోంది’ అని వ్యాఖ్యానించారు. #PartitionHorrorsRemembranceDay హ్యాష్‌ట్యాగ్‌ను షేర్ చేశారు.