News May 3, 2024
నాకు రాజస్థాన్‌లో ఉన్నట్లుంది: బెంగళూరు యువతి
బెంగళూరులో ఎండల తీవ్రతపై ఓ యువతి ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా తాను బెంగళూరులో ఉంటున్నానని.. ఏసీ పెట్టుకునే పరిస్థితి వస్తుందని ఊహించలేదని పేర్కొంటూ తన రూమ్‌లో AC అమర్చిన ఫొటోను షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఏటా వేసవిలో ఎండలు పెరుగుతున్నాయని తనకు రాజస్థాన్‌లో ఉన్నట్లు ఉందన్నారు. దీంతో ఇప్పటికైనా బెంగళూరు వాసులు మేలుకోవాలని, పచ్చదనాన్ని పెంపొందించాలని పలువురు సూచిస్తున్నారు.
Similar News
News November 12, 2024
FBలో బాల్కనీ వీడియో పోస్టు.. అరెస్టు
బెంగళూరులోని MSRనగర్‌లో దంపతులు సాగర్ గురుంగ్, ఊర్మిళ నివసిస్తున్నారు. ఇటీవల ఊర్మిళ తమ బాల్కనీలోని గార్డెన్‌ను వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. అయితే ఆ గార్డెన్‌లో ఉన్న మొక్కల్లో 2 గంజాయి మొక్కలున్నట్లు వీడియోలో కనిపించింది. వీడియో కాస్తా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇంకేముంది పోలీసులు అక్కడికి వెళ్లి ప్రశ్నించగా ఆ కపుల్ తడబడ్డారు. దీంతో వారిద్దరిని అరెస్ట్ చేశారు.
News November 12, 2024
LSGతో విడిపోవడానికి గల కారణం చెప్పేసిన రాహుల్
లక్నో జట్టుతో విడిపోవడానికి గల కారణాన్ని క్రికెటర్ KL.రాహుల్ వెల్లడించారు. తాను సరికొత్త ఆరంభాన్ని కోరుకుంటున్నాని, తనకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్న చోట ఎక్కడైనా ఆడాలని అనుకుంటున్నానని తెలిపారు. కాగా గత సీజన్‌లో మ్యాచ్‌లు ఓడినప్పుడు కెప్టెన్ రాహుల్‌తో LSG ఓనర్ సంజీవ్ గొయెంకా కోపంతో మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే తనకు LSGలో గౌరవం దక్కలేదనే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
News November 12, 2024
బర్త్ డేకు రావాలని ఆహ్వానం.. లోకేశ్ ఏమన్నారంటే?
AP: తమ కూతురి పుట్టినరోజు వేడుకలకు రావాలంటూ ఓ అభిమాని చేసిన ట్వీట్‌కు మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్పారు. చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు, క్షణం తీరికలేని శాఖా వ్యవహారాలు ఉండటంతో వేడుకకు రాలేకపోతున్నందుకు మన్నించాలని కోరారు. కోనసీమ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని కలిసి, పాపకు ఆశీస్సులు అందజేస్తానని రిప్లై ఇచ్చారు.