News February 27, 2025

పోసాని వ్యాఖ్యలు సహించలేకే ఫిర్యాదు చేశా: మణి

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబసభ్యుల గురించి సినీనటుడు పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు సహించలేకే ఆయనపై ఫిర్యాదు చేశానని జనసేన నేత జోగిమణి తెలిపారు. వైసీపీ హయాంలోనే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. ‘పవన్‌పై పోసాని వ్యాఖ్యలతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. ఇష్టానుసారం మాట్లాడవద్దని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించాం. అయినా పోసాని ప్రవర్తన మారలేదు’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News March 20, 2025

చంద్రబాబుతో భేటీపై బిల్‌గేట్స్ ట్వీట్

image

మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్‌గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నిన్న భేటీ అయి పలు ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై బిల్‌గేట్స్ ట్వీట్ చేశారు. ‘బిల్‌గేట్స్ ఫౌండేషన్‌ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు సీఎం చంద్రబాబును కలవడం సంతోషం. వైద్యం, వ్యవసాయం, విద్యలో ఆవిష్కరణల ఆధారిత వృద్ధికి రాష్ట్రానికి మద్దతునిస్తూ వారితో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News March 20, 2025

మన ‘సంతోషం’ తక్కువేనట..

image

ప్రపంచ సంతోష సూచీలో వరుసగా 8వ సారి ఫిన్లాండ్ తొలి స్థానంలో నిలిచింది. 147 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ 118వ స్థానంలో నిలిచింది. పొరుగు దేశాలు నేపాల్(92), PAK(109) భారత్ కంటే ముందు స్థానాల్లో ఉన్నాయి. అయితే గత ఏడాది(126)తో పోలిస్తే ఇండియా తన పొజిషన్‌ను కాస్త మెరుగుపరుచుకుంది. కాగా సామాజిక మద్దతు, ఆయుర్దాయం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులు ఇస్తారు.

News March 20, 2025

భారత జట్టుకు భారీ నజరానా

image

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.58 కోట్ల నజరానా ప్రకటించింది. ఆటగాళ్లతో పాటు సిబ్బంది, సెలక్షన్ కమిటీకి ఈ నగదు అందజేయనున్నట్లు తెలిపింది. మార్చి 9న న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఐసీసీ ప్రైజ్ మనీ(రూ.19.50+కోట్లు)తో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు ఎక్కువ కావడం గమనార్హం.

error: Content is protected !!