News December 18, 2024
రిటైర్మెంట్ గురించి చెప్పడంతో భావోద్వేగానికి లోనయ్యా: కోహ్లీ

అశ్విన్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ స్పందించారు. ‘14 ఏళ్లుగా నీతో ఆడుతున్నా. రిటైర్ అవుతున్నట్లు నాతో చెప్పడంతో భావోద్వేగానికి లోనయ్యా. నీతో ఆడిన రోజులన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. నీతో ఆడిన ప్రతిసారి నేను గేమ్‌ను ఆస్వాదించా. భారత క్రికెట్‌కు నైపుణ్యంతో కూడిన మ్యాచ్ విన్నింగ్ సహకారం మరువలేనిది. నువ్వు ఎప్పటికీ భారత క్రికెట్ లెజెండ్‌గా గుర్తుండిపోతావు. ధన్యవాదాలు మిత్రమా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 17, 2025
CM చంద్రబాబు, లోకేశ్ విదేశీ పర్యటనలు

AP: మంత్రి లోకేశ్ రేపట్నుంచి ఈనెల 25 వరకు AUSలో పర్యటించనున్నారు. వచ్చేనెల 14, 15న విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ప్రారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. పెట్టుబడులు, ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యంగా సీఎం చంద్రబాబు కూడా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు లండన్‌లో పర్యటించనున్నారు. విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు.
News October 17, 2025
బంగ్లా ప్లేయర్ల వాహనాలపై ఫ్యాన్స్ దాడి!

స్వదేశంలో బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్‌కు ఘోర పరాభవం జరిగినట్లు తెలుస్తోంది. అఫ్గనిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 0-3 తేడాతో ఓడిపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. బంగ్లాదేశ్ చేరుకున్న ప్లేయర్ల వాహనాలపై దాడికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆఖరి వన్డేలో 200 రన్స్ తేడాతో ఓడిపోవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ‘కొన్నిసార్లు ఓటమి తప్పదు’ అని ప్లేయర్లు అభిమానులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
News October 17, 2025
చలికాలం వచ్చేస్తోంది.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు!

ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ చలి ఉండొచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి ఉష్ణోగ్రతల వల్ల శ్వాసకోస వ్యాధులు, ఫ్లూ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది. ‘చలిలో తిరగకుండా ఉంటే మంచిది. నూలు వస్త్రాలు, స్కార్ఫులు, క్యాప్, గ్లౌజులు ధరించడం మంచిది. వేడి ఆహారాన్నే తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యం’ అని వైద్యులు సూచిస్తున్నారు.