News May 11, 2024
గవర్నర్ వీడియోల పెన్‌డ్రైవ్ నా దగ్గర ఉంది: మమతా బెనర్జీ

పశ్చిమబెంగాల్ గవర్నర్ ఆనంద బోస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రాజకీయ చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇటీవల గవర్నర్ పౌరులకు చూపించిన వీడియో ఎడిటెడ్ అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తాను మొత్తం ఫుటేజీ చూశానని.. అందులో దిగ్భ్రాంతికి గురిచేసే దృశ్యాలున్నాయని చెప్పారు. దీంతో పాటు మరికొన్ని వీడియోల పెన్‌డ్రైవ్ తన దగ్గర ఉందని తెలిపారు. ఆయన రాజీనామా చేసే వరకు రాజ్ భవన్ కు వెళ్లనని తేల్చి చెప్పారు.
Similar News
News February 7, 2025
ఎన్నికలకు సిద్ధం.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీకీ సిద్ధం అని బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు నారాయణ అన్నారు. గురువారం వనపర్తిలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని అన్నారు.
News February 7, 2025
‘తండేల్’ మూవీ పబ్లిక్ టాక్

చందూ మొండేటి తెరకెక్కించిన ‘తండేల్’ సినిమా షోలు USలో మొదలయ్యాయి. తండేల్ రాజు, సత్య పాత్రల్లో నాగచైతన్య, సాయిపల్లవి నటన, వారి మధ్య కెమెస్ట్రీ అదిరిపోయిందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దేశ భక్తి అంశాలు, DSP మ్యూజిక్, పాటలు ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ స్లోగా ఉందని, డైరెక్టర్ కాస్త ఫోకస్ చేస్తే బాగుండేదంటున్నారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ
News February 7, 2025
మరోసారి SA20 ఫైనల్‌కు సన్‌రైజర్స్

‘SA20’లో ఎలిమినేటర్‌లో పార్ల్ రాయల్స్‌పై గెలిచి సన్‌రైజర్స్(SEC) ముచ్చటగా మూడోసారి ఫైనల్ చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ 175/4 స్కోరు చేసింది. రూబిన్(81), ప్రిటోరియస్(59) రాణించారు. ఛేజింగ్‌లో SEC ఓపెనర్ జోర్జీ(78), జోర్డాన్(69) తడబడకుండా ఆడారు. ఫైనల్లో ముంబై ఇండియన్స్ కేప్‌టైన్(MICT)తో రేపు రాత్రి 9గంటలకు సన్‌రైజర్స్ తలపడనుంది. మార్క్రమ్ సేన తొలి రెండు సీజన్లు కప్ కొట్టిన సంగతి తెలిసిందే.