News February 20, 2025
జగన్ లాంటి నేతను చూడలేదు: CM చంద్రబాబు

AP: ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలు చేయాలని మాజీ సీఎం జగన్‌కు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ‘జగన్ లాంటి రాజకీయ నేతను ఇప్పటి వరకు చూడలేదు. ఎన్నికల కోడ్ ఉన్నా ఉల్లంఘించి ఆయన గుంటూరు వెళ్లారు. ఈసీ ఆదేశాలను కూడా పట్టించుకోలేదు. కోడ్ ఉన్నందున రావడానికి వీల్లేదని పోలీసులు చెప్పినా మిర్చి యార్డుకు వెళ్లి.. తనకు భద్రత కల్పించలేదని అంటున్నారు. ఈసీ కంటే జగన్ గొప్పవారు కాదు’ అని చంద్రబాబు అన్నారు.
Similar News
News March 19, 2025
రేవంత్‌పై నమోదైన కేసు కొట్టివేత

TG: గత ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు తాజాగా కొట్టివేసింది. 2020 మార్చిలో జన్వాడలో డ్రోన్ ఎగురవేశారని రేవంత్‌తో సహా పలువురిపై రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పీఎస్‌లో కేసు నమోదైంది. అలాగే రేవంత్‌ను కించపరిచే విధంగా మాట్లాడారని సైఫాబాద్ పీఎస్‌లో కేటీఆర్‌పై నమోదైన కేసును కూడా హైకోర్టు కొట్టివేసింది.
News March 19, 2025
బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో సమావేశమయ్యారు. వీరిద్దరు సుమారు 40 నిమిషాల పాటు పలు ఒప్పందాలపై చర్చించారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఉద్యోగాల కల్పనలో ఏఐ వినియోగంపై సమాలోచనలు జరిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్-2047 విజన్ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం గేట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కలిసివస్తుందని CBN పేర్కొన్నారు.
News March 19, 2025
చాహల్-ధనశ్రీ విడాకులపై రేపు తీర్పు

చాహల్, ధనశ్రీ విడాకుల పిటిషన్‌పై రేపటిలోగా తీర్పు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు ఆదేశించింది. కూలింగ్ ఆఫ్ వ్యవధిని మినహాయించాలన్న పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించగా, ఆ నిర్ణయాన్ని HC రద్దు చేసింది. చాహల్ IPLలో పాల్గొనాల్సి ఉన్నందున రేపటిలోగా తీర్పు ఇవ్వాలని సూచించింది. 2020లో వీరికి పెళ్లవగా, కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. చాహల్ రూ.4.75కోట్ల భరణం చెల్లించడానికి అంగీకరించారు.