News January 20, 2025

ఇలాంటి అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదు: ఈటల

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై BJP ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్థిక శాఖలో లంచం లేకుండా పనిచేయడం లేదని విమర్శించారు. ఇళ్ల దగ్గరే నేతలు కమిషన్లు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అత్యంత అసమర్థ, అవినీతి, సమన్వయం లేని ఇలాంటి ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చూడలేదని మండిపడ్డారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు, మూసీ పక్కన ఇళ్లు కూల్చే ప్రయత్నం చేసి ఇప్పుడు జవహర్ నగర్‌ను లక్ష్యంగా చేసుకున్నారని దుయ్యబట్టారు.

Similar News

News November 18, 2025

గిల్ స్థానంలో గైక్వాడే కరెక్ట్: ఆకాశ్ చోప్రా

image

గిల్ SAతో రెండో టెస్టు ఆడతారా, లేదా? అన్న దానిపై స్పష్టత రాలేదు. ఆడకపోతే అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ని తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు. ‘గిల్ స్థానంలో ఆడేందుకు సాయి సుదర్శన్, పడిక్కల్ ఉన్నారు. కానీ వారిలో ఎవరిని తీసుకున్నా జట్టులో ఏడుగురు లెఫ్టార్మ్ బ్యాటర్లవుతారు. అది మంచిది కాదు. రుతురాజ్ డొమెస్టిక్‌గా బాగా రాణిస్తున్నారు. అతనే కరెక్ట్ అనిపిస్తోంది’ అని తెలిపారు.

News November 18, 2025

రేపు అకౌంట్లలోకి రూ.7,000.. ఇలా చేయండి

image

AP: రాష్ట్ర ప్రభుత్వం రేపు రైతుల అకౌంట్లలో రూ.7వేలు జమచేయనుంది. కడప జిల్లాలోని పెండ్లిమర్రిలో జరిగే కార్యక్రమంలో పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాగా రైతులు ఆన్‌లైన్‌లో <>annadathasukhibhava.ap.gov.in<<>> ద్వారా తమ అర్హతను తెలుసుకోవచ్చు. పోర్టల్‌కి వెళ్లి Know Your Statusలో వివరాలను ఎంటర్ చేస్తే ఎలిజిబుల్/కాదో తెలుస్తుంది.

News November 18, 2025

ఆంక్షలున్నా US వైపే మన విద్యార్థుల చూపు

image

ఆంక్షలున్నప్పటికీ భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులకోసం అమెరికా వైపే చూస్తున్నారు. ‘ఓపెన్ డోర్స్’ నివేదిక ప్రకారం 2024-25లో USలో 11,77,766 మంది విదేశీ విద్యార్థులు చేరగా వారిలో 3,63,019 మంది భారతీయులే. గత ఏడాదితో పోలిస్తే 10% పెరుగుదల ఉంది. చైనీయులు 2,65,919 మంది కాగా ముందటేడాదికన్నా 4% తగ్గుదల నమోదైంది. మొత్తం విద్యార్థుల్లో 57% STEM కోర్సులకు ప్రాధాన్యమిస్తుండగా వారిలోనూ ఇండియన్స్‌దే అగ్రభాగం.