News August 31, 2024
నేను ఎక్కడికీ పారిపోలేదు: మోహన్ లాల్
హేమ కమిటీ నివేదిక బహిర్గతం అయ్యాక తాను ఎక్కడికీ పారిపోలేదని, ముందస్తు కార్యక్రమాల వల్ల దీనిపై స్పందించలేకపోయానని ‘అమ్మ’ మాజీ అధ్యక్షుడు, నటుడు మోహన్ లాల్ అన్నారు. ఈ నివేదికపై మొత్తం పరిశ్రమ సమాధానం చెప్పాల్సి ఉందని, అయితే ఆర్టిస్ట్స్ సంఘాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవద్దని కోరారు. కమిటీ నివేదికను స్వాగతిస్తూనే దీన్ని బహిర్గతం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు.
Similar News
News September 13, 2024
సాయంత్రం ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. నిన్న తుదిశ్వాస విడిచిన సీతారాం ఏచూరి పార్థివదేహానికి నివాళులు అర్పించనున్నారు. రాత్రి అక్కడే బస చేసి, రేపు ఉదయం హైదరాబాద్‌కు వస్తారు. కాసేపట్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించనున్న ఆయన, ఆ తర్వాత గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి బయల్దేరుతారు.
News September 13, 2024
ఈ నెల 18న క్యాబినెట్ సమావేశం
AP: ఈ నెల 18న సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది. వరద నష్టం, కొత్తవారికి పెన్షన్ల మంజూరు, ఇతర పథకాల అమలు, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. అన్ని శాఖల అధికారులు క్యాబినెట్‌లో చర్చించాల్సిన అంశాలను ఈ నెల 15వ తేదీలోగా పంపాలని సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశించారు.
News September 13, 2024
మంత్రి కొల్లు రవీంద్రకు హైకోర్టులో ఊరట
AP: మంత్రి కొల్లు రవీంద్ర పాస్‌పోర్టును పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 20న మంత్రి విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉండటంతో పాస్‌పోర్ట్ పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది. కాగా ఆయనపై క్రిమినల్ కేసులు ఉండటంతో పాస్‌పోర్ట్ అధికారులు క్లియరెన్స్ నిరాకరించారు. క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో పాస్‌పోర్ట్ తిరస్కరించొద్దని సుప్రీం, హైకోర్టులు తీర్పులిచ్చాయని రవీంద్ర లాయర్ వాదించారు.