News August 11, 2024

నాకు తెలుగు ప్రజలంటే ఇష్టం: మాళవిక

image

తెలుగు ప్రజలంటే తనకు ఇష్టమని నటి మాళవిక మోహనన్ తెలిపారు. తెలుగువారికి ఆమె సమాధానం ఇవ్వడం లేదంటూ ఓ నెటిజన్ చేసిన ఆరోపణను ఆమె తోసిపుచ్చారు. ‘అది నిజంకాదు. నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో కొంతమంది తెలుగువాళ్లే. నాకు ఇక్కడి ప్రజలంటే చాలా ఇష్టం. అందుకే తెలుగు సినిమా చేస్తున్నా. మీరు నాకు చాలా ప్రేమను ఇస్తుంటారు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజాసాబ్‌లో ప్రభాస్ సరసన ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే.

Similar News

News September 10, 2024

ప్రపంచంలోని 20 శాతం చెత్త భారత్‌లోనే

image

ప్రపంచంలోని ప్లాస్టిక్ చెత్తలో 20 శాతం భారత్‌దేనని ఓ సర్వే తెలిపింది. ఏటా 9.3 మిలియన్ల టన్నుల చెత్తను ఉత్పత్తి చేస్తోందని పేర్కొంది. భారత్ తర్వాత నైజీరియా (3.5 Mt), ఇండోనేషియా(3.4 Mt), చైనా(2.8 Mt), పాకిస్థాన్(2.6 Mt), బంగ్లాదేశ్(1.7 Mt), రష్యా(1.7 Mt), బ్రెజిల్(1.4 Mt), థాయిలాండ్(1 Mt) కాంగో (1 Mt) ఉన్నాయి. ఈ దేశాల్లో ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేసే వ్యవస్థలు లేకపోవడంతో చెత్త పెరుగుతోంది.

News September 10, 2024

నేడు తాడేపల్లికి జగన్ రాక

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. టీడీపీ ఆఫీస్, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను రేపు ఆయన పరామర్శించనున్నారు. అదే జైల్లో ఉన్న విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త అవుతు శ్రీనివాసరెడ్డిని కూడా జగన్ కలవనున్నారు. అనంతరం ఆయన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.

News September 10, 2024

చాకలి ఐలమ్మ పోరాటం భావితరాలకు స్ఫూర్తి

image

భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం వీరనారి చాకలి ఐలమ్మ సాయుధ పోరాటం చేశారు. నిజాం నవాబుకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. కౌలు భూమిలో తాను పండించిన పంటను దేశ్‌ముఖ్ రేపాక రామచంద్రారెడ్డి తన అనుచరులతో తరలించుకుపోవడానికి ప్రయత్నించగా వారిని తరిమి కొట్టారు. ఇదే సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికింది. ‘బాంచన్ కాల్మొక్తా’ అనే బతుకులను మార్చడానికి ఐలమ్మ జీవితం త్యాగం చేశారు. నేడు ఆమె వర్ధంతి.