News January 24, 2025
కత్తిపోట్ల వల్ల పట్టు తప్పాను: పోలీసులతో సైఫ్

తనపై కత్తిదాడి కేసులో యాక్టర్ సైఫ్ అలీఖాన్ పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు. ‘కరీనా, నేనూ 11వ ఫ్లోర్‌లో ఉన్నాం. సడన్‌గా అరుపులు వినిపించడంతో జే రూమ్‌కు వెళ్లాం. అతను ఏడుస్తున్నాడు. అక్కడెవరో ఉన్నట్టు గమనించి పట్టుకొనేందుకు ప్రయత్నించా. ఆగంతకుడి కత్తిపోట్ల వల్ల నా పట్టు తప్పింది. వెంటనే జేను వేరే గదిలోకి తీసుకొచ్చాం. ఆ తర్వాత ఇంట్లోవాళ్లు రూ.కోటి డిమాండ్ గురించి చెప్పారు’ అని ఆయన వివరించారు.
Similar News
News February 15, 2025
రోహిత్ శర్మకు షాక్.. WTCలో బుమ్రానే కెప్టెన్?

రోహిత్ శర్మను ఇకపై టెస్టులకు BCCI పరిగణనలోకి తీసుకోకపోవచ్చని PTI వర్గాలు తెలిపాయి. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ప్రారంభమయ్యే కొత్త WTC సీజన్‌లో బుమ్రానే కెప్టెన్‌గా ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జూన్-జులైలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఆయనే సారథ్యం వహిస్తారని తెలుస్తోంది. బుమ్రా స్కాన్ రిపోర్టుల్లో ఎలాంటి సమస్యా లేదని, ముందు జాగ్రత్తగానే NCAకి పంపినట్లు వార్తలు వస్తున్నాయి.
News February 15, 2025
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ

TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, కులగణన, 42శాతం బీసీ రిజర్వేషన్లు, కార్పొరేషన్ పదవులు, MLA కోటా MLC పదవులు సహా మరికొన్ని అంశాలపై ఆయనతో సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం.
News February 15, 2025
వంశీ ఫోన్ కోసం ఇంట్లో సోదాలు

హైదరాబాద్ రాయదుర్గంలోని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నివాసంలో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. కేసులో ఆయన ఫోన్ కీలకం కావడంతో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అది చేతికి వస్తేనే ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్ధన్ అనే వ్యక్తిని వంశీ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో ఆయనను అరెస్టు చేశారు.